logo

ఎలాగైనా ఊరెళ్లాలి.. ఓటేసి తీరాలి

నగరం నుంచి ఊరెళ్లి ఓటేద్దామని చూసేవారిలో ఎక్కువ మంది యుక్త వయసువారే కనిపించారు.

Updated : 30 Nov 2023 05:27 IST

 కిక్కిరిసిపోయిన బస్సులు, వాహనాలు


ఎంజీబీఎస్‌లో బుధవారం రాత్రి బస్సుల కోసం వేచి ఉన్న ప్రయాణికులు

ఈనాడు, హైదరాబాద్‌: నగరం నుంచి ఊరెళ్లి ఓటేద్దామని చూసేవారిలో ఎక్కువ మంది యుక్త వయసువారే కనిపించారు. ఎంజీబీఎస్‌, జేబీఎస్‌తోపాటు.. నగర శివార్లలో ఎక్కడ బస్టాపుల్లో చూసినా 18-25 ఏళ్లలోపు వారే ఎక్కువ మంది కనిపించారు. మరీ ముఖ్యంగా మొదటిసారి ఓటేసేవారు ఎక్కువ మంది ఉన్నారు. ఎవర్ని అడిగినా.. మొదటిసారి ఓటేస్తున్నాం. మాకు ఓటు హక్కు వచ్చిన తర్వాత జరుగుతున్న ఎన్నికలు ఇవి.. ఎట్టి పరిస్థితుల్లో ఓటేసి.. వస్తామని చెబుతున్నారు. ఓటేసిన వెంటనే వాట్సప్‌ డీపీల్లో, స్టేటస్‌, ఇన్‌స్టాగ్రామ్‌లతోపాటు.. ఫేస్‌బుక్‌లో పెట్టుకుంటామని తమ కోరికను వెలిబుచ్చుతున్నారు. మరోవైపు ఊరెళ్లడానికి బస్సులు సరిపోవడం లేదు. వృద్ధులు, పెద్దవాళ్లను ముందుగా బస్సు ఎక్కనిచ్చి తాము నిల్చోని అయినా వెళ్దామనుకుంటున్నామని పలువురు యుక్తవయసు అమ్మాయిలు, అబ్బాయిలు చెబుతున్నారు.

 మెట్రోరైళ్లు కిటకిట

 ఈనాడు, హైదరాబాద్‌: శాసనసభ ఎన్నికల్లో ఓటేసేందుకు సొంతూర్లకు వెళ్లే ప్రయాణికులతో మెట్రోరైళ్లు బుధవారం కిటకిటలాడాయి. అసలే రద్దీగా ఉండే అమీర్‌పేట మెట్రో స్టేషన్‌లో.. సంబంధిత రైళ్లలోకి అడుగుపెట్టలేని పరిస్థితి నెలకొంది. లగేజీతో ఎక్కువమంది ప్రయాణికులు దూర ప్రాంతాలకు వెళ్లేందుకు అమీర్‌పేటకు చేరుకున్నారు. ఎంజీబీఎస్‌, జేబీఎస్‌, ఎల్బీనగర్‌ సహా సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ వైపు వెళ్లే మెట్రోరైళ్లలోనూ ప్రయాణికులు భారీగా ప్రయాణించారు.  

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని