logo

లిఖిద్దాం.. సిరా శాసనం

వ్యాంగులు, 80ఏళ్లు, ఆపై వయస్సున్న వయోధికులకు రవాణా సౌకర్యం కల్పించనున్నారని మేడ్చల్‌-మల్కాజిగిరి కలెక్టర్‌ గౌతమ్‌ పేర్కొన్నారు.

Updated : 30 Nov 2023 06:35 IST

రండి! ఎన్నికల పండగొచ్చింది!

ఐదేళ్ల ప్రశ్నలకు జవాబిద్దాం!

వేలికి సిరాతో కొత్త చరిత్ర రాద్దాం!

మన భవితను తిరగరాద్దాం!
సమర్థ నేతను సభకు పంపుదాం!
ప్రగతి పథానికి దార్శనికులమవుదాం!
విజ్ఞతతో ఆలోచిద్దాం. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిద్దాం!
ఐదు వసంతాలకో అవకాశం.చేజార్చుకోవద్దు ఈ దినం!


దివ్యాంగులు, వయోధికులకు రవాణా సౌకర్యం

ఈనాడు, హైదరాబాద్‌, మేడ్చల్‌ కలెక్టరేట్‌: దివ్యాంగులు, 80ఏళ్లు, ఆపై వయస్సున్న వయోధికులకు రవాణా సౌకర్యం కల్పించనున్నారని మేడ్చల్‌-మల్కాజిగిరి కలెక్టర్‌ గౌతమ్‌ పేర్కొన్నారు. రవాణా అవసరమున్న వారు సాక్ష్యం యాప్‌లో వివరాలు నమోదు చేయాలని కోరారు. ఆధార్‌, సదరం వంటి నకలు ధ్రువపత్రాలను అప్‌లోడ్‌ చేయాలని సూచించారు.


 సా.5 గంటలు దాటినా ఓటేసే అవకాశం

ఆసిఫ్‌నగర్‌, చాంద్రాయణగుట్ట: సాయంత్రం 5 గంటల్లోపు పోలింగ్‌ బూత్‌లోకి వచ్చిన ఓటర్లకు ఓటేసే అవకాశం ఉంటుందని హైదరాబాద్‌ కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి తెలిపారు. మాసబ్‌ట్యాంక్‌ జేఎన్‌ఎఫ్‌యూఏలోని నాంపల్లి డీఆర్సీ కేంద్రాన్ని బుధవారం సందర్శించి మాట్లాడారు.


క్యూలో వేచి ఉండకుండా ఇలా చేయండి

ఈనాడు, హైదరాబాద్‌: నగరంలో చాలా చోట్ల ఉదయం 10 గంటల తర్వాతే పోలింగ్‌ కేంద్రాల వద్ద తాకిడి ఉంటుంది. ఉదయం 7 నుంచి 9 గంటల వరకు చాలా కేంద్రాలు ఖాళీగా ఉంటాయి. ఈ సమయంలో వెళితే 20 నిమిషాల్లోపే ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. పోలింగ్‌బూత్‌ వద్ద క్యూలైన్‌ వివరాలు తెలుసుకునేందుకు జీహెచ్‌ఎంసీ ‘పోల్‌క్యూ రూట్‌’ అందుబాటులోకి తెచ్చింది. జీహెచ్‌ఎంసీ వెబ్‌సైట్‌, మైజీహెచ్‌ఎంసీ యాప్‌లోకి వెళ్లి పోలింగ్‌ కేంద్రం వివరాలు నమోదు చేస్తే సరి. ఎంతమంది క్యూలో వేచి ఉన్నారు.. ఇంకెంత సమయం వేచి ఉండాలో వివరాలు ప్రత్యక్షమవుతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని