logo

ఉషోదయాన్నే తరలివచ్చి.. బాధ్యత నెరవేర్చి

నగర వాతావరణానికి భిన్నంగా గురువారం ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు తరలిరావడం కనిపించింది. సాధారణంగా నగరంలో 11 గంటల తర్వాత కేంద్రాల్లో రద్దీ పెరిగే అవకాశం ఉండటంతో చాలామంది ఉదయమే ఓటేసేందుకు వచ్చారు.

Published : 01 Dec 2023 01:48 IST

ఈనాడు, హైదరాబాద్‌: నగర వాతావరణానికి భిన్నంగా గురువారం ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు తరలిరావడం కనిపించింది. సాధారణంగా నగరంలో 11 గంటల తర్వాత కేంద్రాల్లో రద్దీ పెరిగే అవకాశం ఉండటంతో చాలామంది ఉదయమే ఓటేసేందుకు వచ్చారు. కొందరైతే మార్నింగ్‌ వాక్‌ నుంచి వస్తూ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉదయం 7 గంటలకే పోలింగ్‌ ప్రారంభమవగా ఎక్కువగా మహిళలు, వృద్ధుల రాక కనిపించింది. ఓటరు చీటీలు అందకపోవడంతో కొందరు  వేరే కేంద్రానికి వచ్చారు. ఇలా వచ్చిన ఓటర్లకు అక్కడే ఉన్న సిబ్బంది,  సూచనలు చేశారు. మరోవైపు ఒకే కుటుంబంలో భార్య ఓటు ఒక కేంద్రంలో భర్త ఓటు మరో చోట ఉండటంతో ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా తుది జాబితాలో ఓటు హక్కు పొందిన వారి పేర్లు కొత్త కేంద్రాలకు బదిలీ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని