logo

పోలింగ్‌ కేంద్రాల వద్ద ఉల్లంఘనలు

శాసనసభ ఎన్నికల్లో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ప్రవర్తనా నియమావళి ప్రకారం చర్యలు చేపడతామంటూ ఎన్నికల అధికారులు పదేపదే చెప్పినా గ్రేటర్‌ హైదరాబాద్‌, శివారుల్లోని కొన్ని నియోజకవర్గాల్లో పోలింగ్‌ కేంద్రాలకు....

Published : 01 Dec 2023 01:51 IST

పోలింగ్‌ ఏజెంట్ల వద్ద పార్టీ గుర్తులు, కరపత్రాలు

ఈనాడు, హైదరాబాద్‌: శాసనసభ ఎన్నికల్లో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ప్రవర్తనా నియమావళి ప్రకారం చర్యలు చేపడతామంటూ ఎన్నికల అధికారులు పదేపదే చెప్పినా గ్రేటర్‌ హైదరాబాద్‌, శివారుల్లోని కొన్ని నియోజకవర్గాల్లో పోలింగ్‌ కేంద్రాలకు సమీపంలోనే ప్రధాన పార్టీల అభ్యర్థులు నిబంధనలను ఉల్లంఘించారు. ఓటర్లకు చీటీలు పంచుతున్న ఆయా పార్టీల ఏజెంట్లు కొందరు ఓటర్లకు తమ పార్టీ గుర్తులు, కరపత్రాలు ఇచ్చారు. ఖైరతాబాద్‌, జూబ్లీహిల్స్‌, పాతబస్తీలోని నాలుగు నియోజకవర్గాలు, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, చేవెళ్ల, ఎల్బీనగర్‌, మల్కాజిగిరి, మేడ్చల్‌ నియోజకవర్గాల్లోని కొన్ని పోలింగ్‌ కేంద్రాల్లో యధేచ్ఛగా ఉల్లంఘనలు జరిగాయి.

గూగుల్‌ పే.. ఫోన్‌పే చేస్తేనే ఓట్లు :  కొన్ని పోలింగ్‌ కేంద్రాల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు  ప్రయత్నాలు చేశారు. ఓటుకు రూ.వెయ్యి ఇస్తామంటూ మురికివాడలు, కాలనీల్లోని ఓటర్లతో మాట్లాడుకున్నారు. ఓట్లు వేశాక తాము సూచించిన ప్రాంతానికి వస్తే డబ్బులిస్తామంటూ చెప్పారు. ఓట్లు వేసేముందే డబ్బు కావాలని అది కూడా గూగుల్‌పే, ఫోన్‌పే చేయాలని ఓటర్లు షరతు విధించారు. దీంతో ఏజెంట్లు అప్పటికప్పుడు వేరే ఫోన్ల ద్వారా ఓటర్లకు నగదు బదిలీ చేశారు. ఆ తర్వాతే వెళ్లి ఓట్లేసి వచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని