logo

కోటబాస్పల్లిలో అంధకారం

కోటబాస్పల్లిలో విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో చీకట్లో పోలింగ్‌ నిర్వహించాల్సి వచ్చింది. గురువారం సాయంత్రం 4.30గంటల ప్రాంతంలో సరఫరా నిలిచిపోయింది. దీంతో పోలింగ్‌ కేంద్రంలో అంధకారం అలుముకుంది.

Published : 01 Dec 2023 02:09 IST
తాండూరు గ్రామీణ: కోటబాస్పల్లిలో విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో చీకట్లో పోలింగ్‌ నిర్వహించాల్సి వచ్చింది. గురువారం సాయంత్రం 4.30గంటల ప్రాంతంలో సరఫరా నిలిచిపోయింది. దీంతో పోలింగ్‌ కేంద్రంలో అంధకారం అలుముకుంది. ఈవీఎమ్‌ యంత్రాల్లో అభ్యర్థుల చిత్రాలు, గుర్తులు, మీటను గుర్తించేందుకు వృద్ధులు ఇబ్బందిపడ్డారు. చీకటి కారణంగా అధికారులు యువ ఓటర్లతో పోలింగ్‌ నిర్వహించారు. సర్పంచి నాగార్జున, భారాస ముఖ్యనాయకులు వీరేందర్‌రెడ్డి, వెంకట్రాంరెడ్డిలు ట్రాన్స్‌కో అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో 5.30గంటల ప్రాంతంలో సరఫరా పునరుద్ధరించారు.  
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని