logo

‘ఎగుమతిదార్ల అవసరాలు తీర్చేందుకు ఎస్‌బీఐ సిద్ధం’

ఎస్‌బీఐ హైదరాబాద్‌ సర్కిల్‌ గురువారం ఎగుమతిదార్ల సమావేశం నిర్వహించింది. ఎస్‌బీఐ ఎండీ (ఇంటర్నేషనల్‌ బ్యాంకింగ్‌) చల్లా శ్రీనివాసులు శెట్టి, డిప్యూటీ ఎండీలు నంద్‌ కిషోర్‌, అమితవ ఛటర్జీ, హైదరాబాద్‌ సర్కిల్‌ జీఎం (నెట్‌వర్క్‌-1)...

Published : 01 Dec 2023 02:34 IST

ఈనాడు, హైదరాబాద్‌:  ఎస్‌బీఐ హైదరాబాద్‌ సర్కిల్‌ గురువారం ఎగుమతిదార్ల సమావేశం నిర్వహించింది. ఎస్‌బీఐ ఎండీ (ఇంటర్నేషనల్‌ బ్యాంకింగ్‌) చల్లా శ్రీనివాసులు శెట్టి, డిప్యూటీ ఎండీలు నంద్‌ కిషోర్‌, అమితవ ఛటర్జీ, హైదరాబాద్‌ సర్కిల్‌ జీఎం (నెట్‌వర్క్‌-1) మంజు శర్మ హాజరయ్యారు. ఎగుమతి వ్యాపారంలో నిమగ్నమైన ఎస్‌ఎంఈలకే కాకుండా పెద్ద కార్పొరేట్‌ సంస్థలకూ ఎస్‌బీఐ చేయూత అందిస్తున్నట్లు శ్రీనివాసులు శెట్టి చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ.2.60 లక్షల కోట్ల మేరకు ఎగుమతుల రుణాలు అందించడం ద్వారా, ఈ విభాగంలో 18 శాతం మార్కెట్‌ వాటా లభించిందన్నారు. ఎఫ్‌ఐఈఓ, ఎఫ్‌టీసీసీఐ, ఈసీజీసీ  సంస్థల ప్రతినిధులు పాల్గొని ఎగుమతిదార్ల సమస్యలను ఎస్‌బీఐ ఉన్నతాధికారుల ముందు ప్రస్తావించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని