logo

పల్లెకు పోటెత్తారు

హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల ఓటర్లు గురువారం ఉదయం ఆరుగంటల నుంచి పదిగంటల వరకూ వేల సంఖ్యలో సొంతూర్లకు పోటెత్తారు. పిల్లాపాపలతో కలిసి బైకులు, కార్లు, బస్సులు, ట్రాలీల్లో బయలుదేరి వెళ్లారు.

Published : 01 Dec 2023 02:44 IST

వాహనాలతో స్తంభించిన రహదారులు
పెట్రోల్‌ బంక్‌లో ‘నో స్టాక్‌ బోర్డులు’

ఈనాడు, హైదరాబాద్‌, న్యూస్‌టుడే, వనస్థలిపురం, తుర్కయంజాల్‌ పురపాలక: హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల ఓటర్లు గురువారం ఉదయం ఆరుగంటల నుంచి పదిగంటల వరకూ వేల సంఖ్యలో సొంతూర్లకు పోటెత్తారు. పిల్లాపాపలతో కలిసి బైకులు, కార్లు, బస్సులు, ట్రాలీల్లో బయలుదేరి వెళ్లారు.  దీంతో హైదరాబాద్‌-విజయవాడ రహదారిపై ఎల్బీనగర్‌, పనామా గోడౌన్స్‌ వద్ద, సాగర్‌హైవేపై బీఎన్‌రెడ్డినగర్‌, తుర్కయాంజాల్‌ వద్ద వందల సంఖ్యలోవాహనాలు బారులుతీరాయి.  

పెట్రోల్‌ బంకుల్లో రద్దీ

దిల్‌సుఖ్‌నగర్‌, కొత్తపేట, ఎల్బీనగర్‌, కర్మన్‌ఘాట్‌, మల్లాపూర్‌, మీర్‌పేట్‌, బడంగ్‌పేట్‌ ప్రాంతాల నుంచి వేలమంది ఓటర్లు సొంతూళ్లకు బయలుదేరడంతో ఆయ ప్రాంతాల్లోని పెట్రోల్‌బంకుల్లో విపరీతమైన రద్దీ ఏర్పడింది. ఒక్కసారిగా వందల సంఖ్యలో వాహనదారులు రావడంతో కొన్ని బంకుల్లో ఇంధనం అయిపోవడంతో ‘నో స్టాక్‌’ బోర్డులు పెట్టారు. మరోవైపు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉందని తెలుసుకున్న కొందరు ట్రావెల్‌ ఏజెంట్లు అప్పటికప్పుడు బస్సులు తెప్పించి దేవరకొండ, నల్గొండ, నాగార్జునసాగర్‌లకు సర్వీసులు నడిపించారు. డబుల్‌ ఛార్జీలను వసూలు చేశారు. ఎల్బీనగర్‌ వద్ద ప్రయాణికులు పెరుగుతుండడంతో ఆర్టీసీ అధికారులు కొన్ని సిటీ సర్వీసు బస్సులను జిల్లా బస్సులుగా మార్చి పంపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని