logo

మనకే అనుకూలంగా ఉందా?

‘‘ఓటర్లు మనల్నే ఆదరిస్తారు.. సర్వేలూ మనకే అనుకూలంగా ఉన్నాయ్‌.. మనం గెలుస్తాం.. ఆ డివిజన్‌లో 70శాతం ఓట్లు మనకు పోలయ్యాయ్‌. వేరే పార్టీ వాళ్లు పోరాడినా మనం సులభంగా గెలుస్తాం’’అంటూ భారాస, భాజపా, కాంగ్రెస్‌, మజ్లిస్‌ అభ్యర్థులు తమ...

Published : 01 Dec 2023 02:45 IST

పోలింగ్‌ సరళిపై అభ్యర్థుల్లో టెన్షన్‌

ఈనాడు, హైదరాబాద్‌: ‘‘ఓటర్లు మనల్నే ఆదరిస్తారు.. సర్వేలూ మనకే అనుకూలంగా ఉన్నాయ్‌.. మనం గెలుస్తాం.. ఆ డివిజన్‌లో 70శాతం ఓట్లు మనకు పోలయ్యాయ్‌. వేరే పార్టీ వాళ్లు పోరాడినా మనం సులభంగా గెలుస్తాం’’అంటూ భారాస, భాజపా, కాంగ్రెస్‌, మజ్లిస్‌ అభ్యర్థులు తమ అనుచరులతో అంటున్నారు. పైకి అలా చెబుతున్నా లోలోపల టెన్షన్‌గా ఉంటున్నారు.

లెక్కలు తీస్తూ.. : పోలింగ్‌ పూర్తయ్యాక ఎక్కడ ఓట్లు తక్కువగా వచ్చాయి? ఎక్కడ ఎక్కువ పొందాం.. అన్న అంశాలను తెలుసుకున్నారు.. భారాస అభ్యర్థుల్లో కొందరు తమ నియోజకవర్గాల్లోని పోలింగ్‌ సరళిపై అనుచరులు, పార్టీ నాయకులతో విశ్లేషించారు. కాంగ్రెస్‌ టిక్కెట్‌తో తొలిసారి బరిలో ఉన్న నాయకులు.. సీనియర్‌ నేతలు పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చే అవకాశాలున్నాయి? ఎక్కడ పోలింగ్‌ శాతం తగ్గింది? తగ్గిన ప్రాంతాల్లో మనకే ఓట్లు వచ్చాయా? వంటి అంశాలపై లెక్కలు సేకరిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్‌షా, పర్యటనలతో గ్రేటర్‌లో గణనీయమైన స్థానాల్లో గెలిచే అవకాశాలున్నాయని భాజపా నాయకులు సంతోషంగా ఉన్నారు. హైదరాబాద్‌లో ఏడు స్థానాలతోపాటు మరో రెండు స్థానాల్లోనూ గెలిచే అవకాశాలున్నాయని మజ్లిస్‌ నేతలు లెక్కలేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని