logo

కోటి మాటలే.. సగం మీటలే

భారీ ఎత్తున చైతన్య కార్యక్రమాలు చేపట్టినా రాష్ట్రంలో రాజధాని పరిధిలోనే తక్కువ ఓటింగ్‌ నమోదైంది. ఎన్నికల కమిషన్‌ అధికారికంగా సెలవు ప్రకటించినా ఓటర్లు ఇళ్ల నుంచి పోలింగ్‌ బూత్‌లకు కదలిరాలేదు.

Published : 01 Dec 2023 03:01 IST

రాజధానిలోనే అత్యల్ప పోలింగ్‌

ఈనాడు- సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి, ఈనాడు, హైదరాబాద్‌: భారీ ఎత్తున చైతన్య కార్యక్రమాలు చేపట్టినా రాష్ట్రంలో రాజధాని పరిధిలోనే తక్కువ ఓటింగ్‌ నమోదైంది. ఎన్నికల కమిషన్‌ అధికారికంగా సెలవు ప్రకటించినా ఓటర్లు ఇళ్ల నుంచి పోలింగ్‌ బూత్‌లకు కదలిరాలేదు. రాజధాని పరిధిలోమూడు జిల్లాల్లో కోటికి పైగా ఓటర్లున్నా సగమే ఓటింగ్‌లో పాల్గొన్నారు. 2014 శాసనసభ ఎన్నికల్లో హైదరాబాద్‌ జిల్లా పరిధిలో 52.90 శాతం మంది ఓట్లేయగా 2018లో 48.89 శాతం మంది ఓటర్లే కదిలారు. దీన్ని సవాలుగా తీసుకుని అధికారులు ఈ దఫా ఓటింగ్‌శాతం పెంచేందుకు అనేక చర్యలు తీసుకున్నారు. అయినా ఫలితం పూర్తి విరుద్ధంగా వచ్చింది. ప్రధానంగా పాతబస్తీలోని నియోజకవర్గాల్లో ఓటింగ్‌ శాతం గణనీయంగా తగ్గింది. ఎన్నికల అధికారులు రాత్రి 11 వరకు ఇచ్చిన సమాచారం ప్రకారం హైదరాబాద్‌ జిల్లాల్లో 46.83 శాతం పోలింగ్‌ నమోదైంది. మేడ్చల్‌లో 55.62, రంగారెడ్డిలో 65.42 శాతం ఓటు హక్కు వినియోగించుకున్నారు. నగరంలో అతితక్కువగా యాకుత్‌పురాలో అతితక్కువగా 39శాతం మాత్రమే ఓటేశారు. మహానగరం పరిధిలోని వందల సంఖ్యలో గేటెడ్‌ కమ్యూనిటీలు ఉన్నాయి. ఇక్కడి నుంచి మాత్రం ఓటర్లు పెద్దగా తరలిరాలేదు. రాజధాని పరిధిలో ఓటింగ్‌ తక్కువ నమోదు కావడానికి మరో కారణం కూడా కనిపిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని