logo

ఇంకు చుక్క.. 50 శాతం దాటక

ముగిసిన పోలింగ్‌తో ఊపిరిపీల్చుకున్న నేతలు ఫలితాలు ఎలా ఉంటాయనేది లెక్కలు కడుతున్నారు.  పాతబస్తీ పరిధిలో కొన్నిచోట్ల గతం కన్నా ఓట్ల శాతం పెరగ్గా.. మరికొన్ని నియోజకవర్గాల్లో ఓటర్లు ముఖం చాటేయటంతో ప్రధానపార్టీలు గెలుపోటముల లెక్కల్లో తలమునకలయ్యాయి.

Published : 02 Dec 2023 01:25 IST

పాతబస్తీ పరిధి అభ్యర్థుల్లో ఆందోళన

చార్మినార్‌, మాదన్నపేట- న్యూస్‌టుడే: ముగిసిన పోలింగ్‌తో ఊపిరిపీల్చుకున్న నేతలు ఫలితాలు ఎలా ఉంటాయనేది లెక్కలు కడుతున్నారు.  పాతబస్తీ పరిధిలో కొన్నిచోట్ల గతం కన్నా ఓట్ల శాతం పెరగ్గా.. మరికొన్ని నియోజకవర్గాల్లో ఓటర్లు ముఖం చాటేయటంతో ప్రధానపార్టీలు గెలుపోటముల లెక్కల్లో తలమునకలయ్యాయి. డివిజన్ల వారీగా పోలైన ఓట్ల ఆధారంగా ఎంఐఎం, ఎంబీటీ, కాంగ్రెస్‌, భాజపా నేతలు తమకు పోలైన ఓట్లను అంచనా వేసే పనిలో పడ్డారు. గతంతో పోల్చితే ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో పోలీసులు ప్రత్యేక దృష్టిసారించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర బలగాలు మోహరించటంతో అల్లరిమూకలు వెనక్కి తగ్గాయి. పోలీసు అధికారులపై కాలుదువ్వేందుకు సిద్ధపడే చాంద్రాయణగుట్ట, చార్మినార్‌, యాకుత్‌పుర, బహదూర్‌పుర వంటి ప్రాంతాల్లో ఎన్నికల యంత్రాంగం కఠినంగా వ్యవహరించింది. నిబంధనలు ఉల్లంఘించినట్లు ఫిర్యాదు అందగానే కేసులు నమోదు చేయటంతో గొడవలకు పాల్పడేందుకు వెనుకడుగు వేశారు. బోగస్‌ ఓట్లు వేసేందుకు సిద్ధమైన వారిని ముందుగానే కట్టడి చేయటం, కొందర్ని అరెస్ట్‌ చేయటంతో మిగిలిన ప్రాంతాలు అదుపులోకి వచ్చాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని