logo

18 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు

దేశమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న తెలంగాణ శాసనసభ ఎన్నికల ఫలితాలకు రాజధాని సిద్ధమైంది. గురువారం పోలింగ్‌ పూర్తవగా, పోలైన ఓట్లను ఆదివారం లెక్కించనున్నారు.

Updated : 02 Dec 2023 03:25 IST

మూడు జిల్లాల్లో సిబ్బందికి శిక్షణ పూర్తి

ఈనాడు, హైదరాబాద్‌: దేశమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న తెలంగాణ శాసనసభ ఎన్నికల ఫలితాలకు రాజధాని సిద్ధమైంది. గురువారం పోలింగ్‌ పూర్తవగా, పోలైన ఓట్లను ఆదివారం లెక్కించనున్నారు. గ్రేటర్‌ పరిధిలోని హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల పరిధిలో 18 చోట్ల ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూముల వద్ద అన్ని చర్యలు చేపట్టారు.  హైదరాబాద్‌ జిల్లా పరిధిలో 13 చోట్ల ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికార యంత్రాంగం స్పష్టం చేసింది. ఆ మేరకు జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్‌రాస్‌ శుక్రవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. ఓట్ల లెక్కింపు నిబంధనలు, విధి నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇతరత్రా అంశాలపై అధికారులకు శిక్షణ ఇచ్చారు. సిబ్బంది కేటాయింపు, ఏజెంట్లకు పాసుల జారీ, పోటీలో ఉన్న అభ్యర్థులకు ఇవ్వాల్సిన సమాచారం వంటి అంశాలపై అధికారులు సున్నితంగా వ్యవహరించాలని, ప్రశాంతంగా, సమస్యలకు తావివ్వకుండా ఓట్ల లెక్కింపును పూర్తి చేయాలని ఆదేశించారు.


నియోజకవర్గాల లెక్కింపు కేంద్రాలు ఇవే..

హైదరాబాద్‌ జిల్లా..

ముషీరాబాద్‌ : దోమలగూడలోని ఏవీ కాలేజీ
మలక్‌పేట : అంబర్‌పేటలోని జీహెచ్‌ఎంసీ ఇండోర్‌ స్టేడియం
అంబర్‌పేట : నారాయణగూడలోని రాజా బహదూర్‌ వెంకట్రామిరెడ్డి మహిళా కళాశాల
ఖైరతాబాద్‌, జూబ్లీహిల్స్‌ : యూసఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్‌రెడ్డి స్టేడియం
సనత్‌నగర్‌ : ఉస్మానియా యూనివర్సిటీలోని కామర్స్‌ కళాశాల
నాంపల్లి : మాసబ్‌ట్యాంక్‌లోని ఫైన్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీ
కార్వాన్‌ : మాసబ్‌ట్యాంక్‌లోని పాలిటెక్నిక్‌ కాలేజీ
గోషామహల్‌ : కోఠిలోని తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం
చార్మినార్‌, యాకుత్‌పుర : నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లోని విద్యా సంస్థలు
చాంద్రాయణగుట్ట : బషీర్‌బాగ్‌లోని నిజాం కళాశాల లైబ్రరీ హాల్‌
బహదూర్‌పుర : బండ్లగూడలోని అరోరా లీగల్‌ సర్వీసెస్‌ అకాడమీ
సికింద్రాబాద్‌ : ఉస్మానియా యూనివర్సిటీలోని దూర విద్యాకేంద్రం
కంటోన్మెంట్‌ : సికింద్రాబాద్‌లోని సీఎస్‌ఐఐటీ వెస్లీ కాలేజీ

మేడ్చల్‌- మల్కాజిగిరి..

మేడ్చల్‌, మల్కాజిగిరి, : హోలీమేరీ ఇంజినీరింగ్‌ కళాశాల,
కుత్బుల్లాపూర్‌, : బోగారం, కీసర
కూకట్‌పల్లి, ఉప్పల్‌  

రంగారెడ్డి...

ఎల్బీనగర్‌ : సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియం, సరూర్‌నగర్‌
శేరిలింగంపల్లి : గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియం, గచ్చిబౌలి
ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, కల్వకుర్తి : సీవీఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాల, మంగళ్‌పల్లి, ఇబ్రహీంపట్నం
చేవెళ్ల, రాజేంద్రనగర్‌, : లార్డ్స్‌ ఇంజినీరింగ్‌ కళాశాల,
షాద్‌నగర్‌ : అప్పా సమీపంలో, హిమాయత్‌సాగర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని