logo

గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలి

గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించి సంరక్షించాలని కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ గోసంరక్షణ సంస్థలు విజ్ఞప్తి చేశాయి. పార్లమెంటులో గోవధ నిషేధ బిల్లును ప్రవేశపెట్టి సత్వరం ఆమోదించాలని ప్రధాని మోదీకి విజ్ఞపి చేశాయి.

Published : 02 Dec 2023 01:41 IST

తెలంగాణ గోసంరక్షణ సంస్థల విజ్ఞప్తి

మురళీధర్‌రావును కలిసిన జస్మత్‌పటేల్‌, రితీశ్‌ జాగిర్దార్‌, మహేశ్‌ అగర్వాల్‌, ముఖేశ్‌ చౌహాన్‌ తదితరులు

కాచిగూడ: గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించి సంరక్షించాలని కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ గోసంరక్షణ సంస్థలు విజ్ఞప్తి చేశాయి. పార్లమెంటులో గోవధ నిషేధ బిల్లును ప్రవేశపెట్టి సత్వరం ఆమోదించాలని ప్రధాని మోదీకి విజ్ఞపి చేశాయి. సర్వదళీయ గోరక్షా మంచ్‌ ఆధ్వర్యంలో.. ఈ నెల 6న రవీంద్రభారతిలో ‘గోమాతకు 56 ప్రసాదాలు, అన్నప్రసాదం’ ‘సీతారాముల కల్యాణం’ నృత్య ప్రదర్శనకు హాజరు కావాలని కోరుతూ శుక్రవారం కాచిగూడకు చెందిన తెలంగాణ లౌఫర్‌కౌ ఫౌండేషన్‌ ఛైర్మన్‌ జస్మత్‌పటేల్‌, ప్రాణిమిత్ర రమేశ్‌ జాగిర్దార్‌ మెమోరియల్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపక కార్యదర్శి రితీశ్‌ జాగిర్దార్‌, ట్రస్టీ ముఖేశ్‌ చౌహాన్‌, గోరక్షామంచ్‌ జాతీయ అధ్యక్షుడు జైపాల్‌సింగ్‌ తదితరులు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, భాజపా మధ్యప్రదేశ్‌ ఇన్‌ఛార్జి మురళీధర్‌రావు తదితరులను వారి కార్యాలయాల్లో కలిసి ఆహ్వానపత్రికలు అందజేశారు. కార్యక్రమానికి దేశవ్యాప్తంగా పలువురు ఆధ్యాత్మికవేత్తలు హాజరవుతున్నారని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని