logo

గొంతులో చీముగడ్డకు శస్త్రచికిత్స

తీవ్రమైన గొంతు నొప్పితో బాధపడుతున్న బాలిక ప్రాణాలను ప్రభుత్వ ఈఎన్‌టీ వైద్యులు కాపాడారు. వైద్యుల వివరాల ప్రకారం సిద్దిపేట జిల్లా చేర్యాల దొమ్మేటకి చెందిన శ్రుతి(15) కొన్ని రోజులుగా గొంతు నొప్పితో బాధపడుతోంది.

Published : 02 Dec 2023 01:42 IST

బాలిక ప్రాణాలు నిలిపిన ప్రభుత్వ ఈఎన్‌టీ వైద్యులు

ఆపరేషన్‌ చేసిన ఈఎన్‌టీ వైద్యులు, సిబ్బంది

సుల్తాన్‌బజార్‌: తీవ్రమైన గొంతు నొప్పితో బాధపడుతున్న బాలిక ప్రాణాలను ప్రభుత్వ ఈఎన్‌టీ వైద్యులు కాపాడారు. వైద్యుల వివరాల ప్రకారం సిద్దిపేట జిల్లా చేర్యాల దొమ్మేటకి చెందిన శ్రుతి(15) కొన్ని రోజులుగా గొంతు నొప్పితో బాధపడుతోంది. తల్లిదండ్రులు ఆమెను నవంబరు 28 రాత్రి  కోఠిలోని ప్రభుత్వ ఈఎన్‌టీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు గొంతులో పెద్ద చీముగడ్డ ఉన్నట్టు గుర్తించారు. ఆలస్యం చేస్తే గడ్డ పెరిగి శ్వాసనాళానికి అడ్డుపడుతుందని వెంటనే శస్త్రచికిత్స చేశారు. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. చికిత్స చేసిన ప్రొ.ఆనంద్‌ ఆచార్య నేతృత్వంలోని అసోసియేట్‌ ప్రొఫెసర్‌ సంపత్‌రావు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఫణి, డాక్టర్‌ స్వామి, మత్తుమందు విభాగానికి చెందిన అసోసియేట్‌ ప్రొఫెసర్‌ శ్రీదేవి, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ నిఖిలను సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శంకర్‌ అభినందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని