logo

మంగళ్‌హాట్‌ ఎస్సైఅంబికకు రివార్డు

అసెంబ్లీ  పోలింగ్‌ సందర్భంగా రెండు రాజకీయ పార్టీలకు చెందిన పురుషులు, మహిళలు గొడవపడుతూ శాంతిభద్రతలకు విఘాతం కల్గించేలా వ్యవహరిస్తున్న సమయంలో అక్కడే విధుల్లో ఉన్న మంగళ్‌హాట్‌ మహిళా ఎస్సై జి.అంబిక ప్రదర్శించిన ధైర్యసాహసాల్ని ప్రశంసిస్తూ నగర పోలీసు కమిషనరు ఆమెకు రివార్డు అందజేశారు. 

Published : 02 Dec 2023 01:48 IST

రివార్డులు స్వీకరించిన అంబిక, వినయ్‌కుమార్‌, కృష్ణకుమారితో సీపీ

అబిడ్స్‌: అసెంబ్లీ  పోలింగ్‌ సందర్భంగా రెండు రాజకీయ పార్టీలకు చెందిన పురుషులు, మహిళలు గొడవపడుతూ శాంతిభద్రతలకు విఘాతం కల్గించేలా వ్యవహరిస్తున్న సమయంలో అక్కడే విధుల్లో ఉన్న మంగళ్‌హాట్‌ మహిళా ఎస్సై జి.అంబిక ప్రదర్శించిన ధైర్యసాహసాల్ని ప్రశంసిస్తూ నగర పోలీసు కమిషనరు ఆమెకు రివార్డు అందజేశారు. అదేవిధంగా హబీబ్‌నగర్‌ ఠాణా పరిధిలోని పోలింగ్‌ బూత్‌లో కొందరు బోగస్‌ ఓట్లు వేయడానికి రాగా వారిని ధైర్యంతో నిలువరించి కేసు నమోదు చేయించినందుకు సీఎస్‌డబ్ల్యూ కానిస్టేబుల్‌ వినయ్‌కుమార్‌, విధుల్లో పాల్గొన్న మరో మహిళా కానిస్టేబుల్‌ కృష్ణకుమారిని కూడా సీపీ అభినందించి రివార్డు అందజేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని