logo

కారు ఢీకొని మహిళ మృతి

ఓటు వేసి వెళ్తున్న మహిళను కారు వేగంగా వచ్చి ఢీకొనడంతో మృతి చెందింది. ఈ ఘటన హనుమకొండ జిల్లా కాజీపేట ఫాతిమానగర్‌లో జరిగింది.

Updated : 02 Dec 2023 03:23 IST

నిందితుడు నాగోల్‌ ఎక్సైజ్‌ ఎస్సై కుమారుడిగా గుర్తింపు

కాజీపేటటౌన్‌: ఓటు వేసి వెళ్తున్న మహిళను కారు వేగంగా వచ్చి ఢీకొనడంతో మృతి చెందింది. ఈ ఘటన హనుమకొండ జిల్లా కాజీపేట ఫాతిమానగర్‌లో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. దర్గా కాజీపేటకు చెందిన గాదె జోసెఫ్‌రెడ్డి, కవిత(ప్రైవేటు ఆసుపత్రిలో నర్సు) దంపతులు గురువారం ఉదయం 11గంటలకు స్థానిక సెయింట్‌ గ్యాబ్రియల్‌ పాఠశాలలో ఓటు వేసి  తిరిగి ఇంటికి వెళ్లే క్రమంలో జోసెఫ్‌రెడ్డి ద్విచక్రవాహనం తీస్తుండగా, బండి ఎక్కడానికి రోడ్డుపై నిలబడ్డ కవితను ఫాతిమానగర్‌ నుంచి దర్గా కాజీపేటకు వెళ్తున్న కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. కవిత(39) తల పగిలి తీవ్ర రక్తస్రావమై పడిపోయింది. స్థానికుల సహాయంతో ఎంజీఎం తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ప్రమాదానికి కారణమైన దొడ్ల వంశీభార్గవ్‌ నాగోల్‌లో పనిచేసే ఎక్సైజ్‌ ఎస్సై శరత్‌ కుమారుడిగా పోలీసులు తెలిపారు. జోసెఫ్‌రెడ్డి ఫిర్యాదు మేరకు కాజీపేట పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ సార్ల రాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించి న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ కవిత సహ ఉద్యోగులు, కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగడంతో ట్రాఫిక్‌ స్తంభించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని