logo

మహిళాముద్ర

శాసనసభ ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగంలో మహిళలు స్ఫూర్తిగా నిలిచారు. ఓటు వేయడం విధిగా భావించి ఉదయం నుంచి సాయంత్రం వరకూ పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లి ఓటుహక్కు వినియోగించుకున్నారు.

Published : 02 Dec 2023 02:08 IST

శివారు నియోజకవర్గాల్లో భారీగా ఓటు హక్కు వినియోగం
సికింద్రాబాద్‌లోని పోలింగ్‌బూత్‌ వద్ద మహిళలు

ఈనాడు, హైదరాబాద్‌: శాసనసభ ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగంలో మహిళలు స్ఫూర్తిగా నిలిచారు. ఓటు వేయడం విధిగా భావించి ఉదయం నుంచి సాయంత్రం వరకూ పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లి ఓటుహక్కు వినియోగించుకున్నారు.హైదరాబాద్‌ శివారులోని 13 నియోజకవర్గాల్లో రెండు మినహా అన్ని నియోజకవర్గాల్లో యాభైశాతానికి పైగా మహిళలు, యువతులు ఓట్లు వేశారు. కల్వకుర్తి నియోజకవర్గంలో అత్యధికంగా 82.76శాతం మంది ఓటు వేశారు. రెండు, మూడు స్థానాల్లో షాద్‌నగర్‌, ఇబ్రహీంపట్నం నిలిచాయి. మహానగర పాలక సంస్థ పరిధిలో ఉన్న ఎల్బీనగర్‌, శేరిలింగంపల్లి నియోజవర్గాల్లో మాత్రం మహిళలు ఓటింగ్‌పై ఆసక్తి ప్రదర్శించకపోవడంతో అక్కడ వారి పోలింగ్‌ యాభైశాతం దాటలేదు.

ముందు ఓటేద్దాం పద...

శివారు ప్రాంతాల్లోని జీహెచ్‌ఎంసీ పరిధిలోని నియోజకవర్గాలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న మహిళలు ఓటు వేసేందుకు ఉత్సాహంగా ముందుకొచ్చారు. ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, చేవెళ్ల, మేడ్చల్‌, కుత్బుల్లాపూర్‌ నియోజవర్గాల్లో తొలిసారి ఓటు హక్కు వినియోగించుకున్న యువతుల్లో ఎక్కువమంది డిగ్రీ, ఇంజినీరింగ్‌ విద్యార్థులుండటంతో వారంతా స్నేహితులు, బంధువులతో కలిసి తరలివచ్చారు. దీంతో ఈవీఎంలపై మహిళా ‘ముద్ర’ స్పష్టంగా కనిపించింది. గురువారం సాయంత్రం దాటాక పోలింగ్‌ కేంద్రాల్లో మహిళలు ఉండటంతో కచ్చితమైన పోలింగ్‌ శాతాన్ని ఇవ్వలేకపోయిన అధికారులు శుక్రవారం అధికారికంగా ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని