logo

Hyderabad: భారాసకు జైకొట్టిన కాలనీలు, బస్తీలు

రాజధానిలో భారాస ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి , కాలనీల్లో పనులు ఇతరత్రా కారణాలతో కాలనీ సంక్షేమ సంఘాలు, మహిళా పొదుపు సంఘాల్లోని మెజార్టీ ఓటర్లు ఆ పార్టీకి అండగా నిలిచారని ఫలితాలతో తేలింది.

Updated : 04 Dec 2023 07:38 IST

రాజేంద్రనగర్‌లో భారాస కార్యకర్తల ఆనందోత్సవాలు

ఈనాడు, హైదరాబాద్‌: రాజధానిలో భారాస ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి , కాలనీల్లో పనులు ఇతరత్రా కారణాలతో కాలనీ సంక్షేమ సంఘాలు, మహిళా పొదుపు సంఘాల్లోని మెజార్టీ ఓటర్లు ఆ పార్టీకి అండగా నిలిచారని ఫలితాలతో తేలింది. మంత్రి కేటీఆర్‌ ఎన్నికల ముందు ఆయా నియోజకవర్గాల్లో కాలనీ, పొదుపు మహిళా సంఘాల ప్రతినిధులతో సమావేశమై మద్దతు కోరడంతో.. ఆయా వర్గాలు పూర్తిస్థాయిలో భారాస ఎమ్మెల్యేలను తిరిగి గెలిపించాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ వ్యతిరేక ఫలితాలు వెల్లడైనా.. నగరంలో భారాస విజయానికి ఆయా సంఘాలే కారణమని విశ్లేషకులు అంచనా వేశారు.

బస్తీల్లోనూ..: మరోవైపు బస్తీ ఓటర్లు సైతం భారాసకు పట్టం కట్టారు. కుత్బుల్లాపూర్‌, సికింద్రాబాద్‌, సనత్‌నగర్‌లలోనూ అభ్యర్థులు మంచి మెజార్టీలు సాధించారు. మైనార్టీలు ఎక్కువగా ఉన్న ముషీరాబాద్‌లోనూ భారాస తిరుగులేని విజయం సాధించింది.  బస్తీలకు నీటి సౌకర్యం, రోడ్లు, ఇళ్లు, పలు ప్రభుత్వ పథకాలూ వారిని భారాస వైపు నడిచేలా చేశాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని