logo

Hyderabad: రేవంత్‌ ప్రమాణస్వీకారం.. నేడు నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు

రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్‌రెడ్డి ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారోత్సవం దృష్ట్యా.. గురువారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉంటాయని నగర అదనపు పోలీసు..

Updated : 07 Dec 2023 08:26 IST

నారాయణగూడ, న్యూస్‌టుడే: రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్‌రెడ్డి ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారోత్సవం దృష్ట్యా.. గురువారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉంటాయని నగర అదనపు పోలీసు (ట్రాఫిక్‌) కమిషనర్‌ జి.సుధీర్‌బాబు తెలిపారు.  

  • ఏఆర్‌ పెట్రోల్‌ బంక్‌ జంక్షన్‌ (పబ్లిక్‌ గార్డెన్‌) నుంచి వచ్చే ట్రాఫిక్‌ బషీర్‌బాగ్‌ బాబు జగ్జీవన్‌రాం(బీజేఆర్‌) విగ్రహం కూడలి వైపు అనుమతించరు. ఏఆర్‌ పెట్రోల్‌ బంక్‌ వద్ద నాంపల్లి, చాపెల్‌ రోడ్డు వైపు పంపిస్తారు. 
  • గన్‌ఫౌండ్రి ఎస్‌బీఐ నుంచి బీజేఆర్‌ కూడలి వైపు ట్రాఫిక్‌ను ఎస్‌బీఐ వద్ద చాపెల్‌ రోడ్డు వైపు మళ్లిస్తారు. 
  • బషీర్‌బాగ్‌ కూడలి నుంచి బీజేఆర్‌ కూడలి వైపు వచ్చే ట్రాఫిక్‌కు నో ఎంట్రీ. బషీర్‌బాగ్‌ ఫ్లైఓవర్‌ కూడలి నుంచి కింగ్‌కోఠి, ఓల్డ్‌ ఎమ్మెల్యే క్వార్టర్స్‌ రహదారులపై పంపిస్తారు.
  • సుజాత పబ్లిక్‌ స్కూల్‌ లేన్‌ నుంచి ఖాన్‌ లతీఫ్‌ ఖాన్‌ భవనం వైపు వచ్చే ట్రాఫిక్‌ను స్కూల్‌ జంక్షన్‌ నుంచి నాంపల్లి స్టేషన్‌ వైపు పంపిస్తారు. 
  • ముఖ్యంగా పంజాగుట్ట, వి.వి.విగ్రహం కూడలి, రాజీవ్‌గాంధీ విగ్రహం, నిరంకారి, పాత సైఫాబాద్‌ ఠాణా, లక్డీకాపూల్, ఇక్బాల్‌ మినార్, రవీంద్రభారతి, ట్రాఫిక్‌ పోలీసు కాంప్లెక్స్, బషీర్‌బాగ్, బీజేఆర్‌ విగ్రహం కూడలి, ఎస్‌బీఐ గన్‌ఫౌండ్రి, అబిడ్స్‌ సర్కిల్, ఏఆర్‌ పెట్రోల్‌ బంక్, లిబర్టీ, హిమాయత్‌నగర్, అసెంబ్లీ, ఎంజే మార్కెట్, హైదర్‌గూడ కూడళ్ల వైపు వెళ్లకుండా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. 
  • రవీంద్రభారతి నుంచి బీజేఆర్‌ విగ్రహం వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులు ఎల్బీ స్టేడియం ప్రధాన గేటు (ఖాన్‌ లతీఫ్‌ ఖాన్‌ భనం ముందు) ఏఆర్‌ పెట్రోల్‌ బంక్‌ వద్ద డైవర్షన్‌ తీసుకోవాలి. నాంపల్లి స్టేషన్‌ రోడ్‌ వైపు వెళ్లాలి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని