logo

Hyderabad: సిటీ బస్సుల్లో తొలగిన అడ్డుతెరలు

సిటీబస్సుల్లో సీట్లు పెరిగాయి. గతంలో మహిళలకు రక్షణగా 1300 ఆర్డినరీ బస్సుల్లో అడ్డుతెరలు (డివైడర్లు) ఉండేవి. మగవారు మహిళ ప్రయాణికుల వైపు వెళ్లకుండా అలా ఏర్పాటు చేశారు. వీటికోసం ప్రతి బస్సులో 4 సీట్లను తొలగించారు. అలా ఆర్డినరీ బస్సుల్లో మొత్తం 5 వేల సీట్లు తగ్గాయి. మహిళా ప్రయాణికుల సంఖ్య పెరగడంతో మళ్లీ సీట్లు ఏర్పాటు చేస్తున్నారు.

Updated : 10 Feb 2024 07:30 IST

అదనంగా పెరిగిన సీట్లు

గ్రిల్స్‌ తీసివేశాక బస్సు

ఈనాడు, హైదరాబాద్‌: సిటీబస్సుల్లో సీట్లు పెరిగాయి. గతంలో మహిళలకు రక్షణగా 1300 ఆర్డినరీ బస్సుల్లో అడ్డుతెరలు (డివైడర్లు) ఉండేవి. మగవారు మహిళ ప్రయాణికుల వైపు వెళ్లకుండా అలా ఏర్పాటు చేశారు. వీటికోసం ప్రతి బస్సులో 4 సీట్లను తొలగించారు. అలా ఆర్డినరీ బస్సుల్లో మొత్తం 5 వేల సీట్లు తగ్గాయి. మహిళా ప్రయాణికుల సంఖ్య పెరగడంతో మళ్లీ సీట్లు ఏర్పాటు చేస్తున్నారు. పాత బస్సులను తుక్కుగా మార్చి జిల్లాల్లో తిరిగే డీలక్స్‌, ఎక్స్‌ప్రెస్‌లను నగరానికి తెచ్చి రూపురేఖలు మార్చి ప్రతి బస్సులో 45 సీట్లు తగ్గకుండా చూస్తున్నారు. అలా 800 బస్సులలో మొత్తంగా 3200 సీట్లు అందుబాటులోకి వచ్చినట్టయింది.

సోమవారాల్లో 21 లక్షల మంది .. మహాలక్ష్మి పథకంతో నగరంలో ఒక రోజులో ప్రయాణికుల సంఖ్య 11 లక్షల నుంచి 19 లక్షలకు పెరిగింది. సోమవారం మాత్రం ఏకంగా 21.50 లక్షల మంది వరకూ ప్రయాణిస్తున్నారు. మిగతా రోజుల్లో 19 లక్షల వరకూ ఉంటున్నారని గ్రేటర్‌జోన్‌ అధికారులు చెబుతున్నారు. చాలా మార్గాల్లో కొత్త బస్సుల అవసరం ఉంది. జూన్‌, జులై నాటికి ఎలక్ట్రిక్‌ బస్సులే 500 రానున్నాయి. మరో 500 ఆర్డినరీ బస్సులను సమకూర్చుకునే పనిలో ఉన్నారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని