logo

Hyderabad: ‘విషం తాగాను.. ఆసుపత్రికి తీసుకెళ్లండి’

విద్యుత్తు ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఖైరతాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఏఎస్‌ఐ శ్రీరాములు తెలిపిన వివరాల ప్రకారం..

Updated : 11 Feb 2024 12:45 IST

చికిత్స పొందుతూ విద్యుత్తు ఉద్యోగి మృతి

ఖైరతాబాద్, న్యూస్‌టుడే: విద్యుత్తు ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఖైరతాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఏఎస్‌ఐ శ్రీరాములు తెలిపిన వివరాల ప్రకారం.. చింతల్‌బస్తీలోని స్కైలైన్‌ అపార్టుమెంట్‌లో నివాసం ఉంటున్న రావూరి సునీల్‌ ప్రభాకర్‌ (40) గన్‌రాక్‌ సబ్‌స్టేషన్‌లో పనిచేస్తున్నారు. ఆయనకు భార్య స్వప్న, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఇటీవల విధులకు సరిగా హాజరుకావడం లేదు. ఈక్రమంలో ఈనెల 7న ఇంటి నుంచి ఎవరికీ చెప్పకుండా వెళ్లారు. శుక్రవారం రాత్రి 9.30 ప్రాంతంలో ఖైరతాబాద్‌ బస్టాండ్‌ వద్ద నుంచి ఓ పాదచారి ఫోన్‌ నుంచి సోదరుడికి ఫోన్‌ చేయగా, లిఫ్ట్‌ చేయలేదు. కొద్దిసేపటి తర్వాత సోదరుడు ఫోన్‌ చేయగా, పాదచారి విషయం చెప్పాడు. దీంతో రాత్రి 10 గంటల ప్రాంతంలో అక్కడి చేరుకోగా.. తాను విషం తాగానని, ఆసుపత్రికి తీసుకువెళ్లాలని కోరారు. వెంటనే  మాసాబ్‌ట్యాంక్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ రాత్రి 2 గంటల తర్వాత మృతిచెందాడు. శనివారం ఉదయం ఖైరతాబాద్‌ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అప్పులు పెరిగి, మద్యానికి బానిసై కొద్ది రోజులుగా డిప్రెషన్‌లో ఉంటున్నాడని కుటుంబ సభ్యులు చెప్పినట్లు పోలీసులు వివరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని