logo

రోగుల వివరాలపై ఆరోగ్య శాఖ కార్యదర్శి ఆరా

పరిగి ప్రభుత్వాసుపత్రిని బుధవారం రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి డాక్టర్‌ క్రిస్టినా జెడ్‌ చోంగ్‌, వైద్య విధాన పరిషత్‌ కమిషనర్‌ డాక్టర్‌ అజయ్‌ కుమార్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు.

Published : 22 Feb 2024 02:21 IST

పరిగి, న్యూస్‌టుడే: పరిగి ప్రభుత్వాసుపత్రిని బుధవారం రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి డాక్టర్‌ క్రిస్టినా జెడ్‌ చోంగ్‌, వైద్య విధాన పరిషత్‌ కమిషనర్‌ డాక్టర్‌ అజయ్‌ కుమార్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కోస్గి పర్యటనకు వెళ్తూ ఆమె ఇక్కడకు వచ్చారు. ఈ సందర్భంగా నిత్యం ఆసుపత్రికి వస్తున్న రోగులు, ఇతర సదుపాయాల గురించి జిల్లా ఇంఛార్జి డాక్టర్‌ ప్రదీప్‌కుమార్‌ను అడిగి తెలుసుకున్నారు. రోగులు పెరుగుతున్న నేపథ్యంలో 30పడకల ఆసుపత్రిని వంద పడకలుగా మార్చాలని, సిబ్బందిని నియమించాలని ఆమెకు వినతి పత్రం అందజేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని