logo

కళ్లకు గంతలతో అయోధ్యకు బైక్‌ యాత్ర

మోటారు సైకిళ్లపై కళ్లకు గంతలు కట్టుకుని అయోధ్య రామమందిరానికి బయల్దేరుతున్నట్లు మెజీషియన్లు మారుతి జోషి, రామకృష్ణ తెలిపారు.

Updated : 22 Feb 2024 02:27 IST

ఖైరతాబాద్‌, న్యూస్‌టుడే: మోటారు సైకిళ్లపై కళ్లకు గంతలు కట్టుకుని అయోధ్య రామమందిరానికి బయల్దేరుతున్నట్లు మెజీషియన్లు మారుతి జోషి, రామకృష్ణ తెలిపారు. ఈనెల 23న ఉదయం 9 గంటలకు ముచ్చింతల్‌లోని దివ్యసాకేతం నుంచి ఈ యాత్ర మొదలు కానుందని బుధవారం సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో వివరించారు. యాత్రకు చెందిన బ్రోచర్‌ను సంతోష్‌ రంగనాయకులు స్వామితో కలిసి వారు ఆవిష్కరించి మాట్లాడుతూ.. ప్రజల్ని చైతన్యం చేసే లక్ష్యంతో సాహసోపేతమైన ఈ లక్ష్యాన్ని ఎంచుకున్నట్లు వివరించారు. మొత్తం 1600 కి.మీ. ప్రయాణం 10 రోజులపాటు సాగనుందన్నారు. 23న ఇక్కడి నుంచి బయల్దేరి కామారెడ్డి వెళ్లి బస చేస్తామని, ఆదిలాబాద్‌, నాగ్‌పుర్‌ మీదుగా అయోధ్యకు చేరుకోనున్నట్లు వివరించారు.


నిరీక్షణ ముగిసింది... సంతోషం విరిసింది

ఈనాడు డిజిటల్‌, సిరిసిల్ల, న్యూస్‌టుడే, సిరిసిల్ల గ్రామీణం, శంషాబాద్‌: వాచ్‌మెన్‌ హత్య కేసులో దుబాయ్‌ జైలులో 18 ఏళ్లుగా శిక్ష అనుభవిస్తున్న ఇద్దరికి విముక్తి లభించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా పెద్దూరుకు చెందిన శివరాత్రి మల్లేశం, శివరాత్రిలు బుధవారం ఇంటికి చేరుకున్నారు. కోనరావుపేటకు చెందిన దుండుగుల లక్ష్మణ్‌, చందుర్తికి చెందిన నాంపల్లి వెంకటి, జగిత్యాల జిల్లా మల్యాల మండలం మానాలకు చెందిన హన్మంతులు కలిసి 2004లో ఉపాధి కోసం దుబాయ్‌ వెళ్లారు. 2005లో వీరు పని చేస్తున్న దగ్గర నేపాల్‌కు చెందిన వాచ్‌మెన్‌ దిల్‌ప్రసాద్‌రాయ్‌ హత్యకు గురయ్యాడు. ఈ కేసులో ఈ అయిదుగురికి 25 ఏళ్లు జైలు శిక్ష పడింది. ఈ విషయం తొలుత 2011లో ‘ఈనాడు’ కథనం ద్వారా వెలుగులోకి తెచ్చింది. దీనిపై స్పందించిన మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌ కేటీఆర్‌ స్వయంగా నేపాల్‌ వెళ్లి వాచ్‌మెన్‌ కుటుంబ సభ్యులకు రూ.15 లక్షల నగదు అందజేశారు. హతుడు దిల్‌ప్రసాద్‌రాయ్‌ భార్య నుంచి క్షమాభిక్ష పత్రంలో సంతకం తీసుకుని న్యాయవాదుల ద్వారా దుబాయ్‌ న్యాయస్థానానికి పంపారు. బుధవారం శంషాబాద్‌ విమానాశ్రయంలో కుటుంబ సభ్యులను కలుసుకున్నాక ‘ఈనాడు’ కథనం ద్వారా తమకు సహకారం లభించిందని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని