logo

పరారీలో లాంగ్‌ డ్రైవ్‌ సంస్థ యజమాని హరిదీప్‌రెడ్డి

ఉద్యోగం మానేసినందుకు ఏడుగుర్ని బంధించి చితకబాదిన వ్యవహారంలో మేడిపల్లిలోని లాంగ్‌ డ్రైవ్‌ కార్ల సంస్థ నిర్వాహకుడు హరిదీప్‌రెడ్డి కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో సాంకేతికత ఆధారంగా గాలిస్తున్నారు.

Published : 22 Feb 2024 02:22 IST

ఈనాడు- హైదరాబాద్‌: ఉద్యోగం మానేసినందుకు ఏడుగుర్ని బంధించి చితకబాదిన వ్యవహారంలో మేడిపల్లిలోని లాంగ్‌ డ్రైవ్‌ కార్ల సంస్థ నిర్వాహకుడు హరిదీప్‌రెడ్డి కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో సాంకేతికత ఆధారంగా గాలిస్తున్నారు. ఘటన అనంతరం నిందితుడు పొరుగు రాష్ట్రాలకు పరారైనట్లు సమాచారం అందింది. ఈ కేసులో హరిదీప్‌రెడ్డి సహా 9 మంది పరారీలో ఉన్నారు. ఈ ఈ సంస్థలో ఉద్యోగం మానేశారని నెల 12న ఇద్దరు యువతులు సహా ఏడుగుర్ని సంస్థ యజమాని సహా మరికొందరు కలిసి బంధించి చితకబాదిన విషయం తెలిసిందే. అదే రోజు అర్ధరాత్రి ఫిర్యాదు అందుకున్న మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం బాధితుల స్టేట్‌మెంట్‌ ఇతర ఆధారాలు సేకరించి 13న ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద మార్చి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని