logo

కానిస్టేబుల్‌ అభ్యర్థులకు శిక్షణ షురూ

పోలీసు కానిస్టేబుళ్లుగా ఎంపికైన అభ్యర్థులకు నగరంలోని ఐదు కేంద్రాల్లో శిక్షణ మొదలయ్యింది. పేట్లబుర్జు, చెలాపుర, సైబరాబాద్‌ కమిషనరేట్‌, అంబర్‌పేట ఏఆర్‌ హెడ్‌క్వార్టర్స్‌, మేడ్చల్‌లోని పోలీస్‌ శిక్షణ కేంద్రాల్లో ఏర్పాట్లు చేశారు.

Updated : 22 Feb 2024 05:52 IST

నగర పరిధిలో మొత్తం ఐదు కేంద్రాలు
ప్రారంభించిన హైదరాబాద్‌, సైబరాబాద్‌ సీపీలు

ఈనాడు, హైదరాబాద్‌, న్యూస్‌టుడే, చార్మినార్‌: పోలీసు కానిస్టేబుళ్లుగా ఎంపికైన అభ్యర్థులకు నగరంలోని ఐదు కేంద్రాల్లో శిక్షణ మొదలయ్యింది. పేట్లబుర్జు, చెలాపుర, సైబరాబాద్‌ కమిషనరేట్‌, అంబర్‌పేట ఏఆర్‌ హెడ్‌క్వార్టర్స్‌, మేడ్చల్‌లోని పోలీస్‌ శిక్షణ కేంద్రాల్లో ఏర్పాట్లు చేశారు. పేట్లబుర్జు, చెలాపుర- 285, సైబరాబాద్‌లో 196, అంబర్‌పేట- 482, మేడ్చల్‌- 422 మంది అభ్యర్థులు వచ్చారు. ఇప్పుడు హాజరు కాని వారికి మార్చి ఒకటో తేదీ వరకూ గడువు ఇచ్చారు. బుధవారం పేట్లబుర్జులోని సీటీసీలో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని నగర పోలీస్‌ కమిషనర్‌ కొత్తకోట శ్రీనివాసరెడ్డి, సైబరాబాద్‌ సీటీసీలో కమిషనర్‌ అవినాశ్‌ మహంతి ప్రారంభించి దిశా నిర్దేశం చేశారు. అంబర్‌పేట హెడ్‌క్వార్టర్స్‌లో ఇంటలిజెన్స్‌ చీఫ్‌ శివధర్‌రెడ్డి గురువారం ప్రారంభించనున్నారు.
9 నెలల శిక్షణలో.. :  అభ్యర్థులకు 9 నెలల పాటు శిక్షణ ఇస్తారు. ఔట్‌డోర్‌, ఇండోర్‌ తరహాలో శిక్షణ ఉంటుంది. ఔట్‌డోర్‌లో యోగా, క్రీడలు, పోలీస్‌ డ్రిల్‌, ట్యాక్టికల్‌ ట్రైనింగ్‌, మ్యాప్‌ రీడింగ్‌, జీపీఎస్‌, ఆయుధ శిక్షణ ఇవ్వనున్నారు. ఇండోర్‌ శిక్షణలో చట్టాలపై అవగాహన, శాంతి భద్రతలు, భద్రత, పోలీసు పరిపాలన, వ్యక్తిత్వ వికాసం, కంప్యూటర్‌ శిక్షణ ఉంటుంది.


వృత్తిధర్మాన్ని పాటించాలి..!

‘‘ఇతర ఉద్యోగులు సమయం ముగిశాక ఇళ్లకు వెళితే పోలీసులు మాత్రం 24 గంటలూ ప్రజలకు రక్షణగా ఉంటారు. అంతర్గతంగా ఎదురయ్యే సమస్యల్ని ఎదుర్కోవడానికి సమాజంలో శాంతి కోసం పనిచేస్తూ వృత్తిధర్మాన్ని పాటించాలి’’

కొత్తకోట శ్రీనివాసరెడ్డి, హైదరాబాద్‌ కమిషనర్‌


మంచి పేరు తీసుకురావాలి..!

‘‘లక్షల మంది అభ్యర్థులు పోటీపడితే పోలీసులుగా ప్రజలకు సేవ చేసే అవకాశం కొందరికే వస్తుంది. తెలంగాణ పోలీసులకు దేశంలోనే సముచిత స్థానం ఉంది. అభ్యర్థులు కొత్త విషయాలు నేర్చుకోవడానికి శిక్షణను ఉపయోగించుకుని శాఖకు మంచి పేరు తీసుకురావాలి’’

సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అవినాశ్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు