logo

భుజం కీలు మార్పిడిలో బ్లూప్రింట్‌ సాంకేతికత

భుజం కీలు (షోల్డర్‌ జాయింట్‌) మార్పిడిలో ఆధునిక బ్లూప్రింట్స్‌ సాంకేతికత అందుబాటులోకి వచ్చిందని వైద్య నిపుణులు పేర్కొన్నారు.

Updated : 22 Feb 2024 04:20 IST

మాట్లాడుతున్న చంద్రశేఖర్‌, గురువారెడ్డి, జీన్‌ గ్రిమ్బెర్గ్‌, అనూప్‌రెడ్డి

బేగంపేట: భుజం కీలు (షోల్డర్‌ జాయింట్‌) మార్పిడిలో ఆధునిక బ్లూప్రింట్స్‌ సాంకేతికత అందుబాటులోకి వచ్చిందని వైద్య నిపుణులు పేర్కొన్నారు. బేగంపేటలోని కిమ్స్‌ సన్‌షైన్‌ ఆసుపత్రిలో బుధవారం భుజం కీలు మార్పిడి, ఆధునిక పద్ధతులపై నిర్వహించిన సదస్సుకు ఆసుపత్రి ఛైర్మన్‌ డా.గురువారెడ్డి, సర్జన్‌ డా.చంద్రశేఖర్‌, పారిస్‌కు చెందిన సర్జన్‌ డా.జీన్‌ గ్రిమ్బెర్గ్‌, డా.అనూప్‌రెడ్డి హాజరయ్యారు. వారు మాట్లాడుతూ రోగికి అవసరమైన భుజం కీలు సైజు, ఏ విధానంలో అమర్చాలనేది ముందుగానే బ్లూపింట్‌ తయారు చేయడం ద్వారా శస్త్ర చికిత్స సులభంగా, కచ్చితత్వంతో  జరుగుతుందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని