logo

గోసంరక్షణకు రోజుకో రూపాయి ఉద్యమం

గోసంరక్షణ కోసం రోజుకో రూపాయి పేరిట ఉద్యమాన్ని చేపట్టినట్లు తెలంగాణ గోసంరక్షణ సంస్థలు ప్రకటించాయి. ప్రతి కుటుంబం గోసంరక్షణకు తమవంతు చేయూతగా..

Published : 22 Feb 2024 02:35 IST

రాకేష్‌ప్రసాద్‌ మహారాజ్‌ను సత్కరిస్తున్న జస్మత్‌పటేల్‌, రితీశ్‌జాగిర్దార్‌, తరుణ్‌మెహతా

కాచిగూడ, న్యూస్‌టుడే: గోసంరక్షణ కోసం రోజుకో రూపాయి పేరిట ఉద్యమాన్ని చేపట్టినట్లు తెలంగాణ గోసంరక్షణ సంస్థలు ప్రకటించాయి. ప్రతి కుటుంబం గోసంరక్షణకు తమవంతు చేయూతగా.. ప్రతి రోజూ రూపాయి చొప్పున గోశాలలకు విరాళంగా ఇవ్వాలని విజ్ఞప్తి చేశాయి. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ నుంచి బుధవారం నగరానికి వచ్చిన ఆచార్య రాకేష్‌ప్రసాద్‌ మహారాజ్‌ను తెలంగాణ లౌఫర్‌కౌ ఫౌండేషన్‌ ఛైర్మన్‌ జస్మత్‌పటేల్‌, ప్రాణిమిత్ర రమేష్‌ జాగిర్దార్‌ మెమోరియల్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపక కార్యదర్శి రితీశ్‌ జాగిర్దార్‌, ఆకేజైన్‌ తరుణ్‌మెహతా, జయంతి పటేల్‌ తదితరులు సన్మానించారు. గోసంరక్షణకు తాము చేపడుతున్న కార్యక్రమాలను ఆయనకు వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని