logo

స్మరిద్దాం.. సలాం చేద్దాం

దేశ రక్షణలో ప్రాణాలు పణంగా పెట్టిన జవానుల సంస్మరణార్థం గోల్కొండ ఆర్టిలరీ సెంటర్‌లోని వార్‌ మెమోరియల్‌లో 108 అడుగుల జాతీయ జెండాను బుధవారం ఆర్మీ అధికారులు ఆవిష్కరించారు.

Published : 22 Feb 2024 02:39 IST

గోల్కొండ, న్యూస్‌టుడే: దేశ రక్షణలో ప్రాణాలు పణంగా పెట్టిన జవానుల సంస్మరణార్థం గోల్కొండ ఆర్టిలరీ సెంటర్‌లోని వార్‌ మెమోరియల్‌లో 108 అడుగుల జాతీయ జెండాను బుధవారం ఆర్మీ అధికారులు ఆవిష్కరించారు. మేజర్‌ జనరల్‌ రాకేష్‌ మనోచా జెండాను ఆవిష్కరించి మాట్లాడుతూ.. వార్‌ మెమోరియల్‌లో ఏర్పాటు చేసిన జెండా సైనికులతో పాటు యువతలో స్ఫూర్తి నింపుతుందన్నారు. దేశం కోసం ప్రాణాలర్పించిన  సైనికులను స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సైనికులు ఆలపించిన సింపనీ బ్యాండ్‌ లయబద్ధంగా సాగింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని