logo

సమయ పాలన తప్పితే చర్యలు: డీఈఓ

సమయపాలన పాటించని ఉపాధ్యాయులపై చర్యలు తప్పవని జిల్లా విద్యాధికారిణి రేణుకాదేవి హెచ్చరించారు. ‘సమయానికి రాక..నామమాత్రమే!’ శీర్షికన బుధవారం ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనానికి డీఈఓ రేణుకా దేవి మొదలు ఎంఈఓల వరకు స్పందించి పాఠశాలలను సందర్శించారు.

Published : 22 Feb 2024 02:42 IST

మల్లారెడ్డి గూడెంలో ఉపాధ్యాయురాలితో మాట్లాడుతున్న డీఈఓ రేణుకాదేవి

న్యూస్‌టుడే, తాండూరు, పూడూరు, మోమిన్‌పేట, కుల్కచర్ల గ్రామీణ: సమయపాలన పాటించని ఉపాధ్యాయులపై చర్యలు తప్పవని జిల్లా విద్యాధికారిణి రేణుకాదేవి హెచ్చరించారు. ‘సమయానికి రాక..నామమాత్రమే!’ శీర్షికన బుధవారం ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనానికి డీఈఓ రేణుకా దేవి మొదలు ఎంఈఓల వరకు స్పందించి పాఠశాలలను సందర్శించారు.

మోమిన్‌ పేట మండల పరిధిలోని మల్లారెడ్డి గూడెం మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాలను జిల్లా విద్యాధికారిణి రేణుకాదేవి ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థుల వివరాలు తెలుసుకొని రికార్డులను పరిశీలించారు. విధులకు సమయానికి ఎందుకు ఆలస్యంగా హాజరు కావాల్సి వచ్చిందో విచారించి నివేదిక ఇవ్వాలని ఎంఈవో గోపాల్‌ను ఆదేశించారు. అనంతరం అమ్రాదికలాన్‌ గ్రామంలో పాఠశాలను ఆమె సందర్శించారు. కార్యక్రమంలో మండల ఇన్‌ఛార్జి విద్యాధికారి గోపాల్‌, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

ఉపాధ్యాయులకు తాఖీదులు జారీ: డీఈఓ రేణుకాదేవి సూచన మేరకు తాండూరులోని సాయిపూరు ప్రాథమిక పాఠశాలను బుధవారం మండల విద్యాధికారి వెంకటయ్య సందర్శించారు. పాఠశాలకు సమయానికి రాని ఇద్దరు ఉపాధ్యాయులపై విచారణ జరిపి తాఖీదులు జారీ చేశారు. నివేదికను జిల్లా విద్యాధికారికి పంపించినట్లు తెలిపారు.

పూడూరు ఎంఈఓ హరిశ్చందర్‌, మన్నెగూడ కాంప్లెక్స్‌ ఛైర్మన్‌ రత్నలు మీర్జాపూర్‌ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. ఉపాధ్యాయుల హాజరు సమయ పాలన బాగుందని గుర్తించారు.

కుల్కచర్ల మండల విద్యాధికారి అబీబ్‌ అహ్మద్‌ బుధవారం అంతారం ప్రాథమికోన్నత పాఠశాలను సందర్శించారు. ఉపాధ్యాయుడు ఆలస్యంగా రావడానికి గల కారణాలు, విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని