logo

దూసుకెళ్లేలా.. సొరంగ మార్గాలు

రాజధానిలో అంతర్జాతీయ స్థాయి సొరంగ మార్గాలను నిర్మించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించడంతో.. జీహెచ్‌ఎంసీ ఇంజినీరింగ్‌ విభాగం అధ్యయనానికి సిద్ధమైంది.

Published : 22 Feb 2024 02:56 IST

ట్రాఫిక్‌ సమస్య పరిష్కారంపై సీఎం దృష్టి
అధ్యయనానికి ఏజెన్సీలను ఆహ్వానించిన జీహెచ్‌ఎంసీ
ఈనాడు, హైదరాబాద్‌

రాజధానిలో అంతర్జాతీయ స్థాయి సొరంగ మార్గాలను నిర్మించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించడంతో.. జీహెచ్‌ఎంసీ ఇంజినీరింగ్‌ విభాగం అధ్యయనానికి సిద్ధమైంది. కీలకమైన ఐదు మార్గాలను పరిశీలించేందుకు సంస్థలు దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్‌ ఇచ్చింది. అధ్యయనంలో భాగంగా భౌగోళిక పరిస్థితులు, భూకంపాలు వచ్చేందుకు గల అవకాశాలు, ఇతరత్రా అంశాలతో నివేదిక రూపొందించాలని జీహెచ్‌ఎంసీ పేర్కొంది. బల్దియా ఎంపిక చేసిన 5 రోడ్డు మార్గాలివీ..

ఎక్కడి నుంచి ఎక్కడికంటే..

  • ఐటీసీ కోహినూర్‌ నుంచి విప్రో కూడలి వరకు (వయా ఖాజాగూడ, నానక్‌రామ్‌గూడ)
  • ఐటీసీ కోహినూర్‌ నుంచి జేఎన్‌టీయూ కూడలి వరకు (వయా మైండ్‌స్పేస్‌ కూడలి)
  • ఐటీసీ కోహినూర్‌ నుంచి బంజారాహిల్స్‌ రోడ్డు నం.10(వయా జూబ్లీహిల్స్‌ రోడ్డు నం.45)
  • జీవీకే1 మాల్‌ నుంచి నానల్‌నగర్‌ (వయా మాసబ్‌ ట్యాంక్‌)
  • నాంపల్లి నుంచి చాంద్రాయణగుట్ట (వయా చార్మినార్‌, ఫలక్‌నుమా)

120ఏళ్లు నిలిచేలా.. ఏజెన్సీ ఇచ్చే నివేదికలో ప్రాజెక్టు డిజైన్‌, సొరంగమార్గంతో ముడిపడే ఇతర పనులు, సర్వీసు రోడ్ల పరిస్థితులు, ఎక్కడెక్కడ సొరంగమార్గానికి బయటి నుంచి ర్యాంపులు ఇవ్వొచ్చు, రోడ్డు విస్తరణ, పునరావాసం, నష్టపరిహారం తదతరాల వ్యయాలను తెలపాలని జీహెచ్‌ఎంసీ స్పష్టం చేసింది. 120 ఏళ్లు నిలవాలని, అన్ని సొరంగమార్గాలను ఏడేళ్లలో పూర్తి చేసేట్లు ప్రణాళిక ఇవ్వాలని ఏజెన్సీలను కోరింది.

కేబీఆర్‌ పార్కు కింద రూ.3వేల కోట్లతో..: బంజారాహిల్స్‌ రోడ్డు నం.3లోని షేక్‌పేట మండల కార్యాలయం నుంచి జూబ్లీహిల్స్‌ రోడ్డునం.45 కూడలివరకు సొరంగ మార్గాన్ని నిర్మించాలని గత ప్రభుత్వం అధ్యయనం చేపట్టగా.. ఇటీవల నివేదిక రూపుదిద్దుకుంది. ప్రాథమిక అంచనాల ప్రకారం భూసేకరణ, సొరంగ మార్గం నిర్మాణ పనులకు రూ.3వేల కోట్లు అవసరమని అంచనా వేశారు. ఎమ్మార్వో ఆఫీసు నుంచి ఎల్వీప్రసాద్‌ కంటి ఆస్పత్రి వరకు సొరంగ మార్గం కోసం భారీగా భూసేకరణ చేపట్టాల్సి ఉండటంతో ప్రాజెక్టు ఖర్చు ఎక్కువైందని నిపుణులు అసెంబ్లీ ఎన్నికల ముందే జీహెచ్‌ఎంసీకి స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు