logo

ఆహారకల్తీకి అడ్డుకట్ట

ఆహారకల్తీ నియంత్రణ విభాగం అధికారులను జోన్లకు కేటాయిస్తూ కమిషనర్‌ రోనాల్డ్‌రాస్‌ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఆరోగ్య విభాగం అదనపు కమిషనర్‌ కింద ఫుడ్‌ సెక్యురిటీ అధికారులు పని చేస్తున్నారు.

Published : 23 Feb 2024 02:14 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఆహారకల్తీ నియంత్రణ విభాగం అధికారులను జోన్లకు కేటాయిస్తూ కమిషనర్‌ రోనాల్డ్‌రాస్‌ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఆరోగ్య విభాగం అదనపు కమిషనర్‌ కింద ఫుడ్‌ సెక్యురిటీ అధికారులు పని చేస్తున్నారు. పూర్తిస్థాయిలో సిబ్బంది ఉన్నా కొన్నేళ్లుగా పనితీరు సరిగా ఉండటం లేదనే ఫిర్యాదులున్నాయి. తనిఖీలు, సేకరించే నమూనాల సంఖ్య తగ్గుతోంది. ఈ నేపథ్యంలో రోనాల్డ్‌రాస్‌ అధికార వికేంద్రీకరణకు చర్యలు తీసుకున్నారు. ఎఫ్‌ఎస్‌ఓలను జోన్లకు కేటాయిస్తూ.. సంబంధిత జోనల్‌ కమిషనర్ల ఆధ్వర్యంలో రోజువారీ బాధ్యతలను నిర్వర్తించాలని ఆయన ఉత్తర్వు జారీ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని