logo

8 మంది మృతికి కారకుడైన లారీ డ్రైవర్‌కు రెండేళ్ల జైలు

ఎనిమిది మంది మరణానికి కారకుడైన లారీ డ్రైవర్‌కు రెండేళ్ల జైలు, రూ.11వేల జరిమానా విధిస్తూ మేడ్చల్‌ న్యాయస్థానం గురువారం తీర్పు ఇచ్చింది.

Published : 23 Feb 2024 02:15 IST

మేడ్చల్‌: ఎనిమిది మంది మరణానికి కారకుడైన లారీ డ్రైవర్‌కు రెండేళ్ల జైలు, రూ.11వేల జరిమానా విధిస్తూ మేడ్చల్‌ న్యాయస్థానం గురువారం తీర్పు ఇచ్చింది. అదనపు పీపీ విజయ్‌కుమార్‌ వివరాల ప్రకారం.. మెదక్‌ జిల్లా సదాశివపేట్‌ పిట్టలకేరికి చెందిన ఇర్ఫాన్‌ తన సోదరి పెళ్లి 2016 ఆగస్టు 31న కొంపల్లిలో ఉండగా.. అదే రోజు రాత్రి ఓఆర్‌ఆర్‌ మీదుగా టవేరాలో స్నేహితులతో వస్తున్నారు. మేడ్చల్‌ పరిధి సుతారిగూడ అప్పటి తాత్కాలిక టోల్‌ గేటు టవేరా ఆపారు. అతివేగంగా లారీ టవేరాను వెనక నుంచి బలంగా ఢీ కొట్టగా.. 8 మంది మృతి చెందారు. ఒడిశాకు చెందిన డ్రైవర్‌ శైలేందర్‌ పాండేకు మేడ్చల్‌ 9వ మెట్రోపాలిటన్‌ న్యాయమూర్తి దిలీప్‌ నాయక్‌ తీర్పు ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని