logo

మత్తుకు బానిసలై.. జల్సాలకు అలవాటుపడి చోరీలు

దొంగతనాలను వృత్తిగా చేసుకున్న ముగ్గురిని అల్వాల్‌ పోలీసులు అరెస్టు చేశారు. రూ.22 లక్షల సొత్తు (32 తులాల బంగారు ఆభరణాలు, 4 కిలోల వెండి పాత్రలు, ఒక ల్యాప్‌టాప్‌, కారు) స్వాధీనం చేసుకున్నారు.

Published : 23 Feb 2024 02:17 IST

ముగ్గురు యువకుల అరెస్టు.. రూ.22లక్షల సొత్తు స్వాధీనం

అల్వాల్‌, న్యూస్‌టుడే: దొంగతనాలను వృత్తిగా చేసుకున్న ముగ్గురిని అల్వాల్‌ పోలీసులు అరెస్టు చేశారు. రూ.22 లక్షల సొత్తు (32 తులాల బంగారు ఆభరణాలు, 4 కిలోల వెండి పాత్రలు, ఒక ల్యాప్‌టాప్‌, కారు) స్వాధీనం చేసుకున్నారు. గురువారం సీఐ రాహుల్‌దేవ్‌, డీఐ ప్రమోద్‌కుమార్‌తో కలిసి పేట్‌బషీరాబాద్‌ ఏసీపీ రాములు వివరాలు వెల్లడించారు. నేరేడ్‌మెట్‌ వాసి కార్పెంటర్‌ బండ[విజయ్‌కుమార్‌(28), కుషాయిగూడ వాసి డిగ్రీ విద్యార్థి కృష్ణవంశీ(26), అల్వాల్‌లో కూరగాయల వ్యాపారి చిగుర్ల సతీష్‌(30) నాలుగు నెలల క్రితం స్నేహితులయ్యారు. మత్తుకు బానిసై జల్సాలు చేసేవారు. సులువుగా డబ్బు సంపాదించేందుకు తాళం వేసిన ఇళ్లలో చోరీలు చేయడం ప్రారంభించారు. గోవాలో జల్సా చేసేవారు. బుధవారం మచ్చబొల్లారంలో పట్టుబడ్డారు. వారికి సహకరించిన తేజ, శ్రావణ్‌ పరారీలో ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని