logo

ఎంపీగా గెలిపిస్తే ‘కృష్ణా- వికారాబాద్‌ రైల్వేలైన్‌’ పూర్తి

రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో భాజపా 15 స్థానాల్లో విజయం సాధిస్తుందని మాజీ మంత్రి, భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. పాలమూరు పార్లమెంటు స్థానం నుంచి తాను గెలిస్తేనే.. జిల్లా అభివృద్ధిలో పరుగులు పెడుతుందన్నారు.

Published : 23 Feb 2024 02:18 IST

కొడంగల్‌, న్యూస్‌టుడే: రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో భాజపా 15 స్థానాల్లో విజయం సాధిస్తుందని మాజీ మంత్రి, భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. పాలమూరు పార్లమెంటు స్థానం నుంచి తాను గెలిస్తేనే.. జిల్లా అభివృద్ధిలో పరుగులు పెడుతుందన్నారు. గురువారం విజయ సంకల్పయాత్రలో భాగంగా ఆమె పార్టీ కోశాధికారి శాంతికుమార్‌, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి, పార్టీ నేత పున్నంచంద్‌ తదితరులతో కలిసి కొడంగల్‌లో మాట్లాడారు. కేంద్రం నుంచి భారీగా నిధులు తీసుకు వచ్చి నారాయణపేట్‌ జిల్లా నుంచి వికారాబాద్‌ వరకు ఏర్పాటు చేయనున్న ‘కృష్ణా, వికారాబాద్‌ రైల్వే లైన్‌’ పూర్తి చేయిస్తామన్నారు.  రాష్ట్రంలో తాము అధికారంలోకి రావడానికి.. భాజపా, భారాస ఒక్కటే అనే అబద్దపు ప్రచారాల్ని కాంగ్రెస్‌ నేతలు చేశారన్నారు. రాహుల్‌ గాంధీ ప్రధాని కాలేడని దేశ ప్రజలకు తెలిసి పోతోందన్నారు. కేసీఆర్‌ పాలనలో అవినీతి, కుటుంబ పాలన పెరగడంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటుతో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిందన్నారు. కొడంగల్‌ నుంచి గెలిచి సీఎం అయిన రేవంత్‌రెడ్డి పాలమూరు బిడ్డగా జిల్లాను అభివృద్ధి చేయాలని కోరుతున్నామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని