logo

మెరుగైన వసతులు.. పెరుగుతున్న ప్రసవాలు

ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన సేవలు అందడంతో ప్రసవాల సంఖ్య అధికంగా నమోదవుతోంది. గత ఆగస్టు నుంచి జనవరి 2024 వరకు మొత్తం 7,141 కాన్పులు జరిగాయి.

Published : 23 Feb 2024 02:21 IST

న్యూస్‌టుడే, వికారాబాద్‌ మున్సిపాలిటీ, పరిగి: ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన సేవలు అందడంతో ప్రసవాల సంఖ్య అధికంగా నమోదవుతోంది. గత ఆగస్టు నుంచి జనవరి 2024 వరకు మొత్తం 7,141 కాన్పులు జరిగాయి. ఇందులో 5,341 సర్కారు దవాఖానా, 1,843 ప్రైవేట్‌లో నమోదయ్యాయి. ఆగస్టులో సర్కార్‌ ఆసుపత్రిలో 70 శాతం జరిగితే, ప్రైవేట్‌లో 30 శాతం మాత్రమే అయ్యాయి. సామాన్య ప్రజలపై ఆర్థిక భారం తగ్గిస్తూ, ప్రభుత్వ ఆసుపత్రిల్లో కాన్పుల శాతం పెంచేందుకు వైద్యాధికారులు ప్రత్యేక కార్యక్రమాలను అమలు చేయడంతో పరిస్థితిలో మార్పు వస్తోంది.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో వసతుల కల్పనపై దృష్టి సారించారు. గర్భిణుల వివరాల సేకరించి వారికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాలపై అవగాహన కల్పిస్తున్నారు. అంతేకాకుండా  సాధారణ ప్రసవాలు చేయడంపైనే దృష్టి సారిస్తున్నారు. మండల కేంద్రాల్లోని పీహెచ్‌సీల్లో పరీక్షలు, సాధారణ ప్రసవాలు జరిగేలా ప్రోత్సహిస్తున్నారు. ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు ఎప్పటికప్పుడు గర్భిణుల పరిక్షీంచి సూచనలు, సలహాలు ఇస్తున్నారు. జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలులో రాష్ట్ర స్థాయిలో వికారాబాద్‌ జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. ఇందులో ప్రభుత్వ ఆసుపత్రుల ప్రసవాలను సంఖ్యను కూడా పరిగణనలోకి తీసుకున్నారు.


వైద్య సిబ్బంది కృషి వల్లే మార్పు వస్తోంది

-సాయిబాబా, కార్యక్రమ అధికారి

జిల్లాలో 95 శాతం ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరుగుతున్నాయి. వైద్య సిబ్బంది ఇందుకోసం కృషి చేస్తున్నారు. గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవించే వరకు ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు నిరంతరం వారి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పేద, మధ్య తరగతి కుటుంబాలపై ఆర్థిక భారం పడకుండా చూస్తున్నాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని