logo

నిబంధనలకు బ్లడ్‌బ్యాంకులు తిలోదకాలు

కొన్ని బ్లడ్‌ బ్యాంకులు నిబంధనలకు తిలోదకాలు ఇస్తున్నాయని ఔషధ నియంత్రణశాఖ అధికారుల తనిఖీల్లో తేలింది. గురువారం నగరంలోని9 బ్లండ్‌ బ్యాంకులపై అధికారులు దాడులు చేశారు.

Published : 23 Feb 2024 02:32 IST

9 కేంద్రాలకు డీసీఏ షోకాజ్‌ నోటీసులు

ఈనాడు, హైదరాబాద్‌:  కొన్ని బ్లడ్‌ బ్యాంకులు నిబంధనలకు తిలోదకాలు ఇస్తున్నాయని ఔషధ నియంత్రణశాఖ అధికారుల తనిఖీల్లో తేలింది. గురువారం నగరంలోని9 బ్లండ్‌ బ్యాంకులపై అధికారులు దాడులు చేశారు. నాగోలు ఎక్స్‌రోడ్డులోని శ్రీ బాలాజీ బ్లడ్‌ బ్యాంకు, చైతన్యపురిలోని నవజీవన్‌ బ్లడ్‌ సెంటర్‌, లక్డికాపూల్‌లోని ఏవీఎస్‌ బ్లడ్‌ బ్యాంకు, హిమాయత్‌నగర్‌లోని రుధిర వాలంటరీ బ్లడ్‌ సెంటర్‌, సికింద్రాబాద్‌ ఓల్డ్‌ లాన్సర్‌ లైన్‌లోని ఫాతిమా సాయి బ్లడ్‌ సెంటర్‌, పుత్లీబౌలి ఎక్స్‌రోడ్డులోని తలసీమియా రక్షిత వాలంటరీ బ్లడ్‌ బ్యాంకు, మెహిదీపట్నంలోని వివేకానంద బ్లడ్‌ సెంటర్‌, బాలానగర్‌ ఎక్స్‌రోడ్డులోని నందిని బ్లడ్‌ సెంటర్‌, ఉప్పల్‌ ఎక్స్‌రోడ్డులోని ఎంఎస్‌ఎన్‌ బ్లడ్‌ సెంటర్‌లో ఈ తనిఖీలు నిర్వహించారు. దాతల నుంచి రక్తాన్ని సేకరించిన తర్వాత పరీక్షించేందుకు హెచ్‌ఐవీ, హెపటైటిస్‌ బి, సి, మలేరియా కిట్లు అందుబాటులో లేకపోవడం గుర్తించారు. ప్లాస్మా, ప్లేట్‌లెట్లు, ప్యాక్డ్‌ రెడ్‌ సెల్స్‌ సరైన ఉష్ణోగ్రతల వద్ద భద్రపరచడం లేదని అధికారులు తెలిపారు. తనిఖీలు చేసిన 9 బ్లడ్‌ బ్యాంకులకు షోకాజ్‌ నోటీసులు ఇచ్చామని డీసీఏ డైరెక్టర్‌ జనరల్‌ వి.బి.కమలాసన్‌రెడ్డి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని