logo

ట్రాఫిక్‌ నియంత్రణకు ప్రత్యేక వాహనాలు

నగరంలో నిత్యకృత్యంగా మారుతున్న ట్రాఫిక్‌ సమస్యను పరిష్కరించేందుకు హైదరాబాద్‌ పోలీసులు ‘స్పెషల్‌ ట్రాఫిక్‌ మొబైల్‌’ పేరుతో ప్రత్యేక వాహనాలను రంగంలోకి దించుతున్నారు.

Published : 23 Feb 2024 02:40 IST

ఈనాడు- హైదరాబాద్‌: నగరంలో నిత్యకృత్యంగా మారుతున్న ట్రాఫిక్‌ సమస్యను పరిష్కరించేందుకు హైదరాబాద్‌ పోలీసులు ‘స్పెషల్‌ ట్రాఫిక్‌ మొబైల్‌’ పేరుతో ప్రత్యేక వాహనాలను రంగంలోకి దించుతున్నారు. ఇప్పటివరకూ ప్రధాన జంక్షన్లు, కూడళ్ల దగ్గర ట్రాఫిక్‌ పోలీసులు పర్యవేక్షించేవారు. కొత్తగా ప్రారంభించిన ట్రాఫిక్‌ మొబైల్‌ వాహనాలు(ద్విచక్రవాహనం) అంతటా రద్దీగా ఉండే రహదారులు, మలుపుల దగ్గర గమనిస్తూ రాకపోకల్ని చక్కదిద్దేలా అందుబాటులోకి తెచ్చారు. హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధి 31 ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్ల పరిధిలో 108 మొబైల్‌వాహనాలను(ఒక్కో ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌) సమకూర్చారు. నగరంలో ట్రాఫిక్‌ సమస్య పరిష్కారంపై ప్రత్యేక దృష్టిసారించాలని ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. దీనికి అనుగుణంగా పోలీసులు ఈ స్పెషల్‌ ట్రాఫిక్‌ మొబైళ్లను అందుబాటులోకి తెచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని