logo

ఆలూరు విద్యుత్ సబ్ స్టేషన్ ఆపరేటర్ దారుణ హత్య

చేవెళ్ల మండలంలోని ఆలూరు విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ ఆపరేటర్‌ దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

Updated : 23 Feb 2024 10:44 IST

చేవెళ్ల గ్రామీణం: చేవెళ్ల మండలంలోని ఆలూరు విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ ఆపరేటర్‌ దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  గురువారం రాత్రి  సబ్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న వర్థ్యా హర్యా(40)ను  గుర్తు తెలియని వ్యక్తులు హతమార్చినట్లు వెల్లడించారు. సబ్‌ స్టేషన్‌లో ఉన్న, వ్యక్తిగత ఫోన్లను ఎత్తుకెత్తుకెళ్లినట్లు తెలిపారు. హర్యా స్వగ్రామం  శంకర్‌పల్లి మండలం మోకీల గ్రామం. రెండేళ్లుగా ఆలూరులోని సబ్‌స్టేషన్‌లో ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.   ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు  దర్యాప్తులో తెలియాల్సి ఉంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని