logo

గృహిణి బలవన్మరణం.. తల్లీ కుమారుడికి ఏడేళ్ల కారాగారం

ఓ గృహిణి బలవన్మరణానికి కారణమైన తల్లీ కుమారుడికి న్యాయస్థానం ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. ప్రాసిక్యూషన్‌ కథనం ప్రకారం..

Published : 24 Feb 2024 02:42 IST

రంగారెడ్డి జిల్లా కోర్టులు, న్యూస్‌టుడే: ఓ గృహిణి బలవన్మరణానికి కారణమైన తల్లీ కుమారుడికి న్యాయస్థానం ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. ప్రాసిక్యూషన్‌ కథనం ప్రకారం.. రాజేంద్రనగర్‌కు చెందిన కొత్తపేట శ్రీధర్‌(30), అతడి తల్లి కొత్తపేట జంగమ్మ(50) కలిసి 2017 మే 10న పక్కింట్లో ఉండే శాపురం జంగమ్మ(35), కృష్ణ దంపతులతో స్వల్ప వివాదంతో ఘర్షణ పడ్డారు. శ్రీధర్‌, అతని తల్లి జంగమ్మ అవమానకర రీతిలో శాపురం జంగమ్మను దుర్భాషలాడారు. మానసికంగా కుంగిపోయిన ఆమె ఒంటిపై కిరోసిన్‌ పోసుకొని నిప్పంటించుకుంది. తరువాత మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌కు మరణ వాంగ్మూలం ఇచ్చి కన్ను మూసింది. రాజేంద్రనగర్‌ పోలీసులు కేసు నమోదు చేసి తల్లీకుమారుడిని రిమాండుకు తరలించి కోర్టులో అభియోగ పత్రం దాఖలు చేశారు. కేసు విచారించిన రంగారెడ్డిజిల్లా 4వ అదనపు సహాయ సెషన్స్‌ కోర్టు శుక్రవారం తుది తీర్పు వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు