logo

HYD News: ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

ప్రేమ విఫలమై సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదిభట్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై కృష్ణయ్య వివరాల ప్రకారం..

Published : 24 Feb 2024 07:03 IST

నాగ చంద్ర ప్రకాష్‌

ఆదిభట్ల, న్యూస్‌టుడే: ప్రేమ విఫలమై సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదిభట్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై కృష్ణయ్య వివరాల ప్రకారం.. కోనసీమ జిల్లా వేములపల్లి గ్రామంలో నివాసం ఉండే సత్తి వెంకటేశ్వరరావు కుమారుడు నాగ చంద్రప్రకాష్‌ (24) ఆదిభట్లలోని లక్ష్మీకృప బాయ్స్‌ హాస్టల్‌లో 2021 నుంచి ఉంటూ.. టీసీఎస్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. శుక్రవారం తెల్లవారుజామున హాస్టల్‌లో బెడ్‌ షీట్‌తో ఉరి వేసుకొన్నాడు. ఉదయం తోటి మిత్రులు గుర్తించి ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఓ అమ్మాయితో ప్రేమ విఫలం కావడంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు