logo

ఉద్యోగాల పేరిట యువతకు టోకరా

ఉద్యోగ వేటలో ఉన్న యువకుడిని సైబర్‌నేరగాళ్లు మోసగించారు. కొర్రెములకి చెందిన యువకుడి(24)కి ఈనెల 4న ఓ వ్యక్తి ఫోన్‌ చేసి గూగుల్‌ సంస్థలో ఖాళీలు ఉన్నాయని,  పని చేయడానికి ఆసక్తి ఉందా అని అడిగాడు.

Published : 24 Feb 2024 02:48 IST

ఘట్‌కేసర్‌: ఉద్యోగ వేటలో ఉన్న యువకుడిని సైబర్‌నేరగాళ్లు మోసగించారు. కొర్రెములకి చెందిన యువకుడి(24)కి ఈనెల 4న ఓ వ్యక్తి ఫోన్‌ చేసి గూగుల్‌ సంస్థలో ఖాళీలు ఉన్నాయని,  పని చేయడానికి ఆసక్తి ఉందా అని అడిగాడు. చేస్తానని చెప్పడంతో వెంటనే చరవాణికి టాస్క్‌ పంపించాడు. దానిని పూర్తి చేయడంతో అతని బ్యాంక్‌ఖాతాలో రూ.200 జమ అయ్యాయి. మళ్లీ ఓ టాస్క్‌ పంపించారు. దానిని పూర్తి చేయాలంటే రూ.1000 పంపించాలని చెప్పడంతో వెంటనే డబ్బులు పంపించాడు. ఇలా పలుమార్లు రూ.1,26,632లను పంపించాడు. పదే పదే డబ్బులు పంపించమని ఫోన్‌ చేయడంతో మోసంచేశారని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

యువతికి మోసం:  ఇస్మాయిల్‌ఖాన్‌గూడ హనుమాన్‌నగర్‌ కాలనీకి చెందిన ఓ యువతి(26) ఉద్యోగానికి ఆన్‌లైన్‌లో జాబ్‌ పోర్టల్‌లో పేరు నమోదు చేసుకుంది. చైతన్య అనే వ్యక్తి ఫోన్‌ చేసి బయోడేటా పంపించమన్నాడు. ఆమె అతని వాట్సాప్‌ నంబరుకు పంపించింది. ప్రముఖ సంస్థలో ఇంజినీరింగ్‌ పోస్టు ఖాళీగా ఉందని చెప్పి ఆన్‌లైన్‌లో ఇంటర్వ్యూ చేశాడు. మరో అమ్మాయి మనీషా 3సార్లు ఆన్‌లైన్‌లో ఇంటర్వ్యూ చేసింది. జనవరి 22న పుణెకు రమ్మని చెప్పడంతో ఆమె వెళ్లింది. అక్కడ వారు సూచించిన కార్యాలయానికి చేరుకుంది. మళ్లీ మనీషా ఆన్‌లైన్‌లో ఇంటర్వ్యూ చేయడంతో తిరిగిఇంటికి వచ్చేసింది. చైతన్య అనే వ్యక్తి ఫోన్‌ చేసి ఉద్యోగం రావాలంటే రూ.1,36,800 చెల్లించాలన్నాడు. ఉద్యోగంలో చేరాక తిరిగి ఇస్తారనడంతో డబ్బులు పంపించింది. తర్వాత వారి నుంచి జవాబు లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని