logo

విద్యుత్తు సబ్‌స్టేషన్‌ ఆపరేటర్‌ దారుణ హత్య

మద్యం తాగేందుకు డబ్బులివ్వాలంటూ నలుగురు వ్యక్తులు విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ ఆపరేటర్‌తో గొడవపడి దారుణంగా హత్య చేశారు. చేవెళ్ల పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

Published : 24 Feb 2024 02:51 IST

వర్థ్య హర్యా

చేవెళ్ల గ్రామీణం: మద్యం తాగేందుకు డబ్బులివ్వాలంటూ నలుగురు వ్యక్తులు విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ ఆపరేటర్‌తో గొడవపడి దారుణంగా హత్య చేశారు. చేవెళ్ల పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శంకర్‌పల్లి మండలం మోకిలకు చెందిన వర్థ్య హర్యా(40) రెండేళ్లుగా ఆలూరు సబ్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. ఆయన గురువారం రాత్రి విధి నిర్వహణలో ఉండగా స్థానికంగా ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌లో పనిచేసే నేపాల్‌కి చెందిన వ్యక్తితో పాటు మరో ముగ్గురు మద్యం తాగి వచ్చారు. రాత్రి ఒంటిగంట సమయంలో డబ్బులివ్వాలని గొడవపడ్డారు. కర్రలతో దాడి చేయడంతో పాటు హర్యా తలపై రాళ్లతో కొట్టి హత్య చేశారు. అనంతరం సెల్‌ఫోన్లు తీసుకుని పరారయ్యారు. వెళ్లిపోయారు. గొడవ జరుగుతున్నప్పుడే హర్యా గ్రామంలోని ఓ వ్యక్తికి ఫోన్‌చేశాడు. అతడు వచ్చేలోపు హర్యా రక్తం మడుగులో పడి ఉండడంతో గ్రామస్థులకు, పోలీసులకు సమాచారమిచ్చాడు. నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మిగతా ముగ్గురినీ అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని