logo

నగర రైల్వే స్టేషన్లకు అమృతకాలం

అమృత్‌ భారత్‌ స్టేషన్‌ పథకం కింద నగరంలోని పలు రైల్వే స్టేషన్ల రూపురేఖలు మారనున్నాయి. మల్కాజిగిరి, హైటెక్‌సిటీ, హఫీజ్‌పేట్‌, మలక్‌పేట్‌, ఉప్పుగూడ, హైదరాబాద్‌ రైల్వేస్టేషన్లలో పనులు ప్రారంభమయ్యాయి.

Published : 24 Feb 2024 03:05 IST

బేగంపేట్‌ స్టేషన్‌ నమూనా చిత్రం

ఈనాడు - హైదరాబాద్‌ : అమృత్‌ భారత్‌ స్టేషన్‌ పథకం కింద నగరంలోని పలు రైల్వే స్టేషన్ల రూపురేఖలు మారనున్నాయి. మల్కాజిగిరి, హైటెక్‌సిటీ, హఫీజ్‌పేట్‌, మలక్‌పేట్‌, ఉప్పుగూడ, హైదరాబాద్‌ రైల్వేస్టేషన్లలో పనులు ప్రారంభమయ్యాయి. బేగంపేట రైల్వే స్టేషన్‌ అభివృద్ధికి రూ.26.55 కోట్లు కేటాయించినట్టు సికింద్రాబాద్‌ డివిజన్‌ డిప్యూటీ కమర్షియల్‌ మేనేజర్‌ మనోహర్‌రెడ్డి తెలిపారు. సుమారు రోజూ 16,648మంది వచ్చిపోయే ఈస్టేషన్‌కు విమానాశ్రయ స్థాయి సౌకర్యాలు కల్పించాలని ద.మ. రైల్వే నిర్ణయించింది. హైదరాబాద్‌ రైల్వే స్టేషన్‌కు రూ.309 కోట్లు, ఎంఎంటీఎస్‌ స్టేషన్లకు రూ.144.06 కోట్లు కేటాయించారు.

అభివృద్ధి ఇలా.. ప్రయాణికుల కోసం అత్యాధునిక మరుగుదొడ్లు, 12మీటర్ల వెడల్పు ర్యాంపుతో పాదచారుల వంతెన, 2 లిఫ్టులు, ఎస్కలేటర్లు, ప్లాట్‌ఫామ్‌ మొత్తానికి షెడ్డు నిర్మాణం, స్టేషన్‌ బయట పచ్చిక బయళ్లు, నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌ నిర్దేశాలకు అనుగుణంగా మురుగునీటి శుద్ధికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఎంఎంటీఎస్‌ స్టేషన్లలో దూర ప్రాంతాలకు రాకపోకలు సాగించే ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఆగేలా అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పటికే ప్లాట్‌ఫామ్‌ల పొడవు పెంచగా వాటికి మరిన్ని హంగులు సమకూర్చే ద.మ. రైల్వే నిమగ్నమయ్యింది. 24 బోగీల రైలు ఆగే ప్లాట్‌ఫామ్‌ అంతా పైకప్పులు రానున్నాయి. ఎంఎంటీఎస్‌  స్టేషన్లకుఇరువైపుల నుంచి చేరుకునే విధంగా రోడ్లు, 6 మీటర్ల వెడల్పుతో కొత్త వంతెనలు, లిఫ్టులు సమకూరనున్నాయి.విశ్రాంతి గదులు, ప్రయాణికులు సులభంగా సౌకర్యాలను గుర్తించే విధంగా డిజిటల్‌ సైన్‌బోర్డులు అందుబాటులోకి వస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని