logo

కడచూపు కోసం కదిలొచ్చిన అభిమానం

కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే లాస్య నందిత అకాల మరణం తీవ్రంగా కలిచివేసిందని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పేర్కొన్నారు. ఆమె మృతికి సంతాపం తెలిపి కుటుంబసభ్యులకు తన సానుభూతిని వ్యక్తం చేశారు.

Updated : 24 Feb 2024 04:48 IST

లాస్య మృతికి ఎమ్మెల్యే సంతాపం

కూకట్‌పల్లి, న్యూస్‌టుడే: కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే లాస్య నందిత అకాల మరణం తీవ్రంగా కలిచివేసిందని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పేర్కొన్నారు. ఆమె మృతికి సంతాపం తెలిపి కుటుంబసభ్యులకు తన సానుభూతిని వ్యక్తం చేశారు. దివంగత మాజీ ఎమ్మెల్యే సాయన్నతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ చిన్న వయసులో ఆయన కూతురు రోడ్డు ప్రమాదం మృత్యువాత పడటం తమ పార్టీకి, ఆ కుటుంబానికి తీరనిలోటన్నారు.

లాస్యనందిత నివాసం వద్ద మాజీ మంత్రులు హరీశ్‌రావు, శ్రీనివాస్‌యాదవ్‌, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కాలేరు వెంకటేశ్‌, మాధవరం కృష్ణారావు తదితరులు


పార్టీ చేసుకుందామనుకున్నాం
- కడియం శ్రీహరి కుమార్తె కావ్య

మేము ఇద్దరం కలిసి సికింద్రాబాద్‌లోని సెయింట్‌ ఆన్స్‌ స్కూల్‌లో నాలుగో తరగతి నుంచి కలిసి చదువుకున్నాం. అప్పటి నుంచి మా స్నేహం కొనసాగుతోంది. ఆమె మరణాన్ని తట్టుకోలేకపోతున్నాను. ఎమ్మెల్యేగా గెలిచాక ఫోన్‌ చేసి శుభాకాంక్షలు చెప్పాను. గెలిచినందుకు పార్టీ కూడా చేసుకుందామని అనుకున్నాం. భారాస అధికారంలోకి వచ్చి ఉంటే బాగుండేదని నాతో అనేది.


ఇంకా షాక్‌లోనే ఉన్నా
- కార్పొరేటర్‌ సామల హేమ

లాస్య నందిత మరణించారన్న సమాచారంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యా. ఇంకా తేరుకోలేకపోతున్నా. కవాడిగూడ కార్పొరేటర్‌గా లాస్య, సీతాఫల్‌మండి కార్పొరేటర్‌గా నేను 2016లో జీహెచ్‌ఎంసీలో అడుగుపెట్టాం.. కొద్దిరోజులకే మంచి స్నేహితులయ్యాం.


లాస్య నందిత భౌతికకాయం వద్ద మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

మాజీ మంత్రి హరీశ్‌రావు

ఎమ్మెల్సీ కవిత

ఎమ్మెల్యే కడియం శ్రీహరి

మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి

నగర ఉప మేయర్‌ మోతే శ్రీలతరెడ్డి

రోడు ప్రమాదంలో మృతి చెందిన ఎమ్మెల్యే లాస్య నందితను చివరిసారి చూసేందుకు కంటోన్మెంట్‌లో ఆమె నివాస గృహం వద్దకు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన అభిమానులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని