logo

కృత్రిమ మేధ, డాటాసైన్స్‌దే భవిష్యత్తు

ఇంజినీరింగ్‌ అయిన వెంటనే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించాలంటే చదువుకునేప్పుడే సృజనాత్మక ఆలోచనలు, కృత్రిమమేధ, డేటాసైన్స్‌ సబ్జెక్టులపై సాధించాలని వర్సిటీలను సందర్శిస్తున్న నిపుణులు చెబుతున్నారు.

Updated : 24 Feb 2024 05:11 IST

ఇంజినీరింగ్‌ విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు మార్గాలు
సంస్కరణలు, మూల్యాంకనాల్లో సమూల మార్పులు

ఈనాడు, హైదరాబాద్‌: ఇంజినీరింగ్‌ అయిన వెంటనే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించాలంటే చదువుకునేప్పుడే సృజనాత్మక ఆలోచనలు, కృత్రిమమేధ, డేటాసైన్స్‌ సబ్జెక్టులపై సాధించాలని వర్సిటీలను సందర్శిస్తున్న నిపుణులు చెబుతున్నారు. తెలంగాణలో ఏటా 1.10 లక్షల మంది ఇంజినీరింగ్‌ పట్టా తీసుకుంటుండగా... ఇందులో పది శాతం మంది కూడా ఉద్యోగాలు సాధించడం లేదు. అంకుర సంస్థలను స్థాపించేందుకు కొద్దిమందే ముందుకొస్తున్నారు.

అమెజాన్‌కు ఆర్డర్‌ చేసే స్మార్ట్‌ఫ్రిజ్‌... విదేశాల్లో కృత్రిమ మేధ, డేటా సైన్స్‌, ఆటోమేషన్‌ అంశాలపై అనూహ్యమైన వేగంతో పరిశోధనలు జరుగుతున్నాయి. ఓ ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తుల పరిశ్రమ కొద్ది నెలల కిందట కృత్రిమ మేధతో అనుసంధానమైన స్మార్ట్‌ఫ్రిజ్‌ను అమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీ, ఐరోపా దేశాల్లో ఆవిష్కరించింది. ఒక సాంకేతిక పరికరాన్ని ఫ్రిజ్‌లో అమర్చితే చాలు.. అందులోని కూరగాయలు ఏ రోజు వండుకోవాలో చెబుతుంది. పండ్లు, ఇతర సామగ్రి ఖాళీ అవుతున్నప్పుడు అమెజాన్‌లో ఆర్డర్‌ చేస్తుంది. ఇలాంటి ఆలోచనలు, సాఫ్ట్‌వేర్‌లు ఇతర రంగాలకూ అవసరం. వీటితో పాటు ఇంటర్‌నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ ద్వారా విదేశీయుల జీవనశైలుల్లో మార్పులు వస్తున్నాయి.


వేగంగా సంస్కరణలు రావాలి
ప్రొఫెసర్‌ నవీన్‌ కుమార్‌, ఉస్మానియా వర్శిటీ  

విద్యార్థులు ఇంకా సంప్రదాయ పద్ధతుల్లోనే చదువుతున్నారు. మూల్యాంకన పద్ధతులన్నీ మార్చే సంస్కరణలు రావాలి. సంప్రదాయ కోర్సులతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయా?అన్న అంశాలను కేంద్ర, రాష్ట్ర విద్యాశాఖలు విశ్లేషించాలి.


విశ్వవిద్యాలయాలు, పరిశ్రమలతో అనుసంధానం
ప్రొఫెసర్‌ సుప్రీతి, జేఎన్‌టీయూ హైదరాబాద్‌

ఇంజనీరింగ్‌ విద్యార్థులు ఉద్యోగార్థులుగా కాకుండా ఉద్యోగాలు ఇచ్చేస్థాయికి ఎదగాలంటే  వర్సిటీలు పరిశ్రమలతో అనుసంధానం చేసుకోవాలి. ఐటీ సంస్థలు, పరిశ్రమలతో ఒప్పందాలు కుదుర్చుకుని మా విద్యార్థులకు ప్రాజెక్టులు ఇవ్వాలంటూ కోరాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని