logo

పది పరీక్షలకు పక్కా ఏర్పాట్లు చేయండి: కలెక్టర్‌

జిల్లాలో పదో తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని, ఇందుకోసం తగిన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో ముఖ్య సూపరింటెండెంట్‌లు, మండల విద్యాధికారులకు ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పరీక్షలు మార్చి 18 నుంచి ఏప్రిల్‌ 2 వరకు కొనసాగుతాయని తెలిపారు.

Published : 28 Feb 2024 02:05 IST

మాట్లాడుతున్న కలెక్టర్‌ నారాయణరెడ్డి, చిత్రంలో డీఈఓ రేణుకాదేవి

వికారాబాద్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: జిల్లాలో పదో తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని, ఇందుకోసం తగిన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో ముఖ్య సూపరింటెండెంట్‌లు, మండల విద్యాధికారులకు ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పరీక్షలు మార్చి 18 నుంచి ఏప్రిల్‌ 2 వరకు కొనసాగుతాయని తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో ఫర్నిచర్‌, తాగునీరు, విద్యుత్తు, ఫ్యాన్లు తదితర సౌకర్యాలు ఉండేలా చూడాలన్నారు. సమావేశంలో జిల్లా విద్యాధికారిణి రేణుకాదేవి, ఏసీజీఈ రాంరెడ్డి, మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.

  • జిల్లాలో కొనసాగుతున్న ఉపాధి హామీ పథకం పనులు వారంలోగా పూర్తి చేయాలని కలెక్టర్‌ నారాయణరెడ్డి తహసీల్దార్లుకు, ఎంపీడీవోలకు ఆదేశించారు. మంగళవారం టెలికాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడుతూ పనుల పూర్తి కోసం కార్మికులను సన్నాహపర్చి వారికి ఉపాధి కల్పించాలని సూచించారు.  

రోడ్ల నిర్మాణంలో నాణ్యత తప్పనిసరి

బొంరాస్‌పేట, న్యూస్‌టుడే: గ్రామాల్లో ఉపాధిహామీ పథకం నిధులతో చేపట్టిన సిమెంట్‌ రోడ్ల నిర్మాణ పనుల్లో నాణ్యత పాటించాలని జిల్లా పాలనాధికారి నారాయణరెడ్డి సూచించారు మంగళవారం మండలంలోని మెట్లకుంటలో రూ.15 లక్షల నిధులతో చేపట్టిన రోడ్డు పనులను పరిశీలించారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్‌ ఈఈ శ్రీరాములు, డీఈ సుదర్శన్‌రావు, ఏఈ సురేందర్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి సిద్దు తదితరులున్నారు.

పరిగి, న్యూస్‌టుడే: పల్లెల్లో నిర్మితమవుతున్న సిమెంటు రోడ్ల విషయంలో కచ్చితంగా నాణ్యతా ప్రమాణాలు పాటించాలని జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని రంగంపల్లి గ్రామంలో రూ.5లక్షలతో ఏర్పాటు చేస్తున్న సీసీ రోడ్డు పనులను వికారాబాద్‌ పంచాయతీరాజ్‌ ఈఈ ఉమేష్‌కుమార్‌, పరిగి డీఈఈ సుదర్శన్‌రెడ్డితో కలిసి పరిశీలించి మాట్లాడారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని