logo

కేటీఆర్‌ను అడ్డుకున్న యువజన కాంగ్రెస్‌

అంబర్‌పేటకు వచ్చిన భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్‌ వాహన శ్రేణిని  మంగళవారం యువజన కాంగ్రెస్‌ గ్రేటర్‌ హైదరాబాద్‌ అధ్యక్షుడు మోత రోహిత్‌ ఆధ్వర్యంలో  అడ్డుకున్నారు.

Published : 28 Feb 2024 02:06 IST

కేటీఆర్‌ వాహన శ్రేణిని అడ్డుకుంటున్న యువజన కాంగ్రెస్‌ నేతలు

గోల్నాక, న్యూస్‌టుడే: అంబర్‌పేటకు వచ్చిన భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్‌ వాహన శ్రేణిని  మంగళవారం యువజన కాంగ్రెస్‌ గ్రేటర్‌ హైదరాబాద్‌ అధ్యక్షుడు మోత రోహిత్‌ ఆధ్వర్యంలో  అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తుంటే ఓర్వలేక కేటీఆర్‌ తప్పుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నేతలు మోయిజ్‌, రహ్మత్‌ అలీ, హాజీ, పవన్‌, రాకేష్‌, అఖిల్‌, ఫయాజ్‌, తాజుద్దీన్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని