logo

ఈఎస్‌ఐలో తొలిసారి కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స

మూత్రపిండాలు చెడిపోవడంతో డయాలసిస్‌పై ఉన్న రోగికి ఓ జీవన్మృతుడు తన కిడ్నీ ఇచ్చి ప్రాణదానం చేశాడు. ఉస్మానియా ఆసుపత్రి నుంచి సురక్షితంగా కిడ్నీని తరలించిన ఈఎస్‌ఐ వైద్యులు శస్త్రచికిత్స ద్వారా బాధితుడికి అమర్చారు.

Published : 28 Feb 2024 02:10 IST

కిడ్నీ అమర్చిన ఈఎస్‌ఐ వైద్య బృందం

సనత్‌నగర్‌, న్యూస్‌టుడే: మూత్రపిండాలు చెడిపోవడంతో డయాలసిస్‌పై ఉన్న రోగికి ఓ జీవన్మృతుడు తన కిడ్నీ ఇచ్చి ప్రాణదానం చేశాడు. ఉస్మానియా ఆసుపత్రి నుంచి సురక్షితంగా కిడ్నీని తరలించిన ఈఎస్‌ఐ వైద్యులు శస్త్రచికిత్స ద్వారా బాధితుడికి అమర్చారు. ఈఎస్‌ఐ చరిత్రలోనే తొలి కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించినట్లు వైద్యులు తెలిపారు. మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో సనత్‌నగర్‌ ఈఎస్‌ఐ వైద్య నిపుణులు జగదీశ్వర్‌, పాండురంగారావు, ధనలక్ష్మి ఈ వివరాలు వెల్లడించారు. ఈఎస్‌ఐ బీమాదారు రాజ్‌కుమార్‌ తన రెండు కిడ్నీలు పాడవ్వడంతో నాలుగేళ్లుగా డయాలసిస్‌పై జీవిస్తున్నారు. ఈ నెల 21న ఉస్మానియాలో జీవన్మృతుడైన ఓ వ్యక్తి  కిడ్నీని జీవన్‌దాన్‌ సంస్థ కేటాయించింది. దీంతో ఈఎస్‌ఐ వైద్యులు కార్తిక్‌, సందీప్‌ తదితరులు రోగి రాజ్‌కుమార్‌కు శస్త్రచికిత్స ద్వారా కిడ్నీ అమర్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని