logo

సీవీ ఆనంద్‌ పేరుతో సామాజిక మాధ్యమాల్లో నకిలీ ఖాతాలు

రాష్ట్రంలోని ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, వైద్యుల పేరుతో ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సాప్‌, ఎక్స్‌ వంటి సామాజిక మాధ్యమాల్లో ఖాతాలు తెరిచి వారి సహోద్యోగులకు డబ్బులు అడగటంతో పాటు అనుచిత సందేశాలు పంపిస్తున్న యువకుడిని హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేశారు.

Updated : 28 Feb 2024 05:29 IST

రాజస్థాన్‌ యువకుడి అరెస్టు

జాఫర్‌ఖాన్‌

నారాయణగూడ, న్యూస్‌టుడే: రాష్ట్రంలోని ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, వైద్యుల పేరుతో ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సాప్‌, ఎక్స్‌ వంటి సామాజిక మాధ్యమాల్లో ఖాతాలు తెరిచి వారి సహోద్యోగులకు డబ్బులు అడగటంతో పాటు అనుచిత సందేశాలు పంపిస్తున్న యువకుడిని హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. ఇటీవల తన పేరిట ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సాప్‌లలో దాదాపు ఎనిమిది ఖాతాలు తెరిచి తెలిసినవారికి అనుచిత సందేశాలు పంపిస్తూ.. కొందరికి అత్యవసరంగా డబ్బు కావాలంటూ సందేశాలు వస్తున్నట్లు ఏసీబీ డీజీ సీవీ ఆనంద్‌ హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఈ క్రమంలో రాజస్థాన్‌ రాష్ట్రంలోని అళ్వార్‌, ఆరావలి విహార్‌ థానే, సమోలా, ఇటార్నా రోడ్‌లో నివసించే 22 ఏళ్ల జాఫర్‌ఖాన్‌ ఇదంతా చేస్తున్నట్లు సాంకేతిక ఆధారాలతో గుర్తించారు. సీవీ ఆనంద్‌తో పాటు ఐఏఎస్‌లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, వైద్యుల పేర్లతో సామాజిక మాధ్యమాల్లో నకిలీ ఖాతాలు తెరిచి జాఫర్‌ఖాన్‌ మోసాలకు పాల్పడుతున్నట్లు తేలింది. నగర జాయింట్‌ పోలీసు కమిషనర్‌ (క్రైమ్స్‌ అండ్‌ సిట్‌) ఏవీ రంగానాథ్‌ సారథ్యంలో సైబర్‌ క్రైమ్స్‌ డీసీపీ డి.కవిత మార్గదర్శనంలో ఏసీపీ శివమారుతి, ఏసీపీ (సోషల్‌ మీడియా) చాంద్‌పాషాల పర్యవేక్షణలో ఇన్‌స్పెక్టర్‌ సైదులు నేతృత్వంలో ఎస్సై ఆర్‌.ప్రసేన్‌రెడ్డి బృందం కేసును ఛేదించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని