logo

అట్టహాసంగా రామోజీ గ్రూప్‌ స్పోర్ట్స్‌ మీట్‌

రామోజీ గ్రూప్‌ స్పోర్ట్స్‌ మీట్‌ 2024ను రామోజీ ఫిల్మ్‌సిటీ ఎండీ సీహెచ్‌ విజయేశ్వరి మంగళవారం జ్యోతి వెలిగించి ప్రారంభించారు. రమాదేవి పబ్లిక్‌ స్కూల్‌ క్రీడా మైదానంలో జరిగిన కార్యక్రమానికి ఫిల్మ్‌సిటీ సీఈఓ కె.శేషసాయి, యూకేఎంపీఎల్‌ డైరెక్టర్‌ ఎం.శివరామకృష్ణ, రామోజీ గ్రూప్‌ మానవ వనరుల విభాగం ప్రెసిడెంట్‌ డా.ఎ.గోపాల్‌రావు, హార్టికల్చర్‌ విభాగం వైస్‌ప్రెసిడెంట్‌ డా.ఆర్‌.చంద్రశేఖర్‌ హాజరయ్యారు.

Updated : 28 Feb 2024 05:35 IST

జ్యోతి వెలిగిస్తున్న రామోజీ ఫిల్మ్‌సిటీ ఎండీ సీహెచ్‌ విజయేశ్వరి. చిత్రంలో ఎం.శివరామకృష్ణ, డా.ఎ.గోపాల్‌రావు, డా.ఆర్‌.చంద్రశేఖర్‌

రామోజీ ఫిల్మ్‌సిటీ, న్యూస్‌టుడే: రామోజీ గ్రూప్‌ స్పోర్ట్స్‌ మీట్‌ 2024ను రామోజీ ఫిల్మ్‌సిటీ ఎండీ సీహెచ్‌ విజయేశ్వరి మంగళవారం జ్యోతి వెలిగించి ప్రారంభించారు. రమాదేవి పబ్లిక్‌ స్కూల్‌ క్రీడా మైదానంలో జరిగిన కార్యక్రమానికి ఫిల్మ్‌సిటీ సీఈఓ కె.శేషసాయి, యూకేఎంపీఎల్‌ డైరెక్టర్‌ ఎం.శివరామకృష్ణ, రామోజీ గ్రూప్‌ మానవ వనరుల విభాగం ప్రెసిడెంట్‌ డా.ఎ.గోపాల్‌రావు, హార్టికల్చర్‌ విభాగం వైస్‌ప్రెసిడెంట్‌ డా.ఆర్‌.చంద్రశేఖర్‌ హాజరయ్యారు. క్రీడా పతాకాన్ని ఆవిష్కరించి, గాలిలోకి బెలూన్లు వదిలారు. క్రీడా జ్యోతిని వెలిగించి క్రీడాకారులకు అందజేశారు. క్రికెట్‌ పోటీలకు టాస్‌ వేశారు. విజయేశ్వరి బ్యాట్‌ పట్టి క్రికెట్‌ ఆడి ఉద్యోగుల్లో ఉత్సాహం నింపారు. ఉద్యోగినులతో కలిసి మ్యూజికల్‌ ఛైర్‌, టెన్నికాయిట్‌, త్రోబాల్‌ ఆడారు. ఫిల్మ్‌సిటీ సీఈఓ కె.శేషసాయి మాట్లాడుతూ.. క్రీడలతో ఉద్యోగుల మధ్య మంచి స్నేహపూర్వక వాతావరణం పెంపొందుతుందన్నారు. పురుషులకు క్రికెట్‌, వాలీబాల్‌, టగాఫ్‌వార్‌, బ్యాడ్మింటన్‌, షాట్‌పుట్‌, ఉద్యోగినులకు ఖోఖో, టగాఫ్‌వార్‌, త్రోబాల్‌, మ్యూజికల్‌ ఛైర్‌, షాట్‌పుట్‌, బ్యాడ్మింటన్‌, టెన్నికాయిట్‌ పోటీలు నిర్వహిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని