logo

‘లాస్య నందిత కారు ఢీకొంది ఏ వాహనాన్నో గుర్తించలేదు’

పటాన్‌చెరు ఓఆర్‌ఆర్‌పై కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే కారు ప్రమాదానికి గురైన కేసులో పోలీసులు అన్ని ఆధారాలను క్షుణ్నంగా పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు.

Published : 28 Feb 2024 02:19 IST

పటాన్‌చెరు అర్బన్‌, న్యూస్‌టుడే: పటాన్‌చెరు ఓఆర్‌ఆర్‌పై కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే కారు ప్రమాదానికి గురైన కేసులో పోలీసులు అన్ని ఆధారాలను క్షుణ్నంగా పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాద సమయంలో ఓఆర్‌ఆర్‌పై వెళ్లిన వాహనాల వివరాలు తీసుకుని వారిని పిలిపించి విచారిస్తున్నారు. రవాణా శాఖ అధికారుల నుంచి వాహనాల వివరాలు కూడా తీసుకుంటున్నారు. డ్రైవర్‌ ఆకాశ్‌ రక్త నమూనాల నివేదిక మరో రెండు రోజుల్లో రానుందని పోలీసులు తెలిపారు. ఎమ్మెల్యే లాస్యనందిత కారు ఏ వాహనాన్ని ఢీకొందో ఇంకా గుర్తించలేదని విచారణ కొనసాగుతుందని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని